Nawazuddin Siddiqui: మరోసారి భర్తపై సంచలన కామెంట్స్ చేసిన నవాజుద్ధీన్ భార్య.. తనపై అత్యాచారణం చేశాడంటూ ఆవేదన.

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖిపై అత్యాచారం ఆరోపణలు. సినిమాల్లో కాదు. నిజ జీవితంలో. ఆయనపై అత్యాచారం కేసు పెట్టింది కూడా ఎవరో కాదు ఆయన కట్టుకున్న భార్య ఆలియా. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ఆలియా సిద్ధిఖీ...

Nawazuddin Siddiqui: మరోసారి భర్తపై సంచలన కామెంట్స్ చేసిన నవాజుద్ధీన్ భార్య.. తనపై అత్యాచారణం చేశాడంటూ ఆవేదన.
Nawazuddin Siddiqui
Follow us

|

Updated on: Feb 25, 2023 | 12:04 PM

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖిపై అత్యాచారం ఆరోపణలు. సినిమాల్లో కాదు. నిజ జీవితంలో. ఆయనపై అత్యాచారం కేసు పెట్టింది కూడా ఎవరో కాదు ఆయన కట్టుకున్న భార్య ఆలియా. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు ఆలియా సిద్ధిఖీ. వాటిని పోలీసులకు సమర్పించానంటూ చెప్పారామె. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆలియా మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఫైట్‌ కాస్తా కోర్టు వరకు వెళ్లింది.

అదంతా ఒక ఎత్తయితే.. తాజాగా ఆలియా సిద్ధిఖీ చేసిన ట్వీట్, ఇన్‌స్టాలో విడుదల చేసిన వీడియో హాట్ టాపిక్‌గా మారింది. నా పిల్లలను అక్రమ సంతానమని, ఇప్పుడేమో లాక్కోవాలని చూస్తున్నారంటూ ఆలియా సిద్ధిఖీ కంటతడి పెట్టారు. నవాజుద్దీన్‌ సిద్దిఖీ మహానటుడు. ఏనాడూ పిల్లల్ని పట్టించుకున్న పాపాన పోని తన భర్త.. ఇప్పుడు గొప్ప తండ్రిగా నిరూపించుకోవాలని చూస్తున్నాడని.. తల్లి నుంచి పిల్లల్ని లాక్కెళ్లే ప్రయత్నాల్ని అడ్డుకుంటానని ఆలియా ఆరోపిస్తోంది. మరి ఈ ఫ్యామిలీ డ్రామా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

నవాజుద్దీన్‌ సిద్ధిఖికి ఆలియా రెండో భార్య. 2009లో వీరి వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు సాఫీగా సాగిన వీరి సంసారం జీవితంలో గత కొన్నేళ్లుగా కలహాలు మొదలయ్యాయి. అయితే గతేడాది ఈ జంట మళ్లీ ఒకటి కానున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆలియా సిద్దిఖి చేసిన వ్యాఖ్యలు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి ఈ జంట వార్తల్లోకెక్కింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..