AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Rashmi: నీ ఇంటి అడ్రస్ చెప్పు నేనే వస్తా.. ట్రోలర్‏కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మి..

కుక్కలు కూడా మనలాగే ప్రాణులను.. వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.

Anchor Rashmi: నీ ఇంటి అడ్రస్ చెప్పు నేనే వస్తా.. ట్రోలర్‏కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మి..
Rashmi
Rajitha Chanti
|

Updated on: Feb 25, 2023 | 12:07 PM

Share

బుల్లితెరపై యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్ధస్త్ కామెడీ షోలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంది. అంతేకాకుండా సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటుంది. అయితే రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. మూగ జీవాలను హింసించిన సంఘటనలపై తరచూ ఆమె సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. స్ట్రీట్ డాగ్స్ విషయంలో ఇప్పటికే ఎన్నోసార్లు ఆమె తన ప్రేమ కనపరుస్తుంటుంది. కోవిడ్ సమయంలో వీధి కుక్కలకు ఆహారాన్ని అందించింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఐదేళ్ల బాలుడిని కుక్కలు కరిచి చంపిన ఘటనపై సైతం రష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. కుక్కలు కూడా మనలాగే ప్రాణులను.. వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.

రష్మీ అభిప్రాయానికి కొందరు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం ఆమెను దారుణంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మీని ఓ వ్యక్తి దారుణంగా ట్రోల్ చేశాడు. రష్మీని కుక్కతో పోలుస్తూ ట్వీట్ చేశాడు. “ఈ కుక్క రష్మీని.. కుక్కను కొట్టినట్లు కొట్టాలి” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఆసహనానికి గురైన రష్మీ అతడికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. “తప్పకుండా.. నీ అడ్రస్ చెప్పు. నేనే వచ్చిన నిన్ను కలుస్తా. ఎలా కొడతావో నేను చూస్తా. నీకు ఇదే నా ఛాలెంజ్” అంటూ అతడికి సవాలు విసిరింది. ఇందుకు సంబందించిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ట్రోలింగ్స్ పై రష్మీకి మద్దతు తెలుపుతున్నారు కొందరు నెటిజన్స్. అలాంటి కామెంట్స్ పట్టించుకోవద్దని.. నీకు మద్దతుగా మేం ఉన్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?