తన ఆత్మకథలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ టమాటా రైతు గురించి ప్రస్తావించిన సోనూసూద్
కరోనా సమయంలో సోనూసూద్ పేదలపాలిట దైవంగా మారాడు. దేశం మొత్తం సోనూసూద్ ను ప్రశంశలతో ముంచెత్తింది. ఇప్పటికీ తన సేవలను కొనసాగిస్తున్నాడు సోనూసూద్.
కరోనా సమయంలో సోనూసూద్ పేదలపాలిట దైవంగా మారాడు. దేశం మొత్తం సోనూసూద్ ను ప్రశంశలతో ముంచెత్తింది. ఇప్పటికీ తన సేవలను కొనసాగిస్తున్నాడు సోనూసూద్. అయితే సోనూసూద్ తన ఆత్మకథను సిద్ధం చేస్తున్నాడు. తన ఆత్మకథ ‘అయామ్ నో మెసయ్య’ లో చిత్తూరు జిల్లా మదనపల్లె అమ్మాయిల గురించి ప్రస్తావించాడు సోనూ. ఈ ఏడాది జులై 25న శనివారం తన దృష్టిని ఓ వీడియో ఆకర్షించిందని, చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ టమాటా రైతుకు సంబంధించిన ఈ వీడియోను కృష్ణమూర్తి అనే జర్నలిస్టు అప్‌లోడ్ చేశారని సోనూ సూద్ పేర్కొన్నాడు. నాగలికి ఎద్దులు ఉండాల్సిన స్థానంలో రైతు తన కుమార్తెలను ఉంచడం చూసి తన మనసు కదిలిపోయిందని రాసుకొచ్చాడు. క్షణకాలం పాటు ఆ దృశ్యం తన హృదయాన్ని మెలిపెట్టిందని, స్కూల్లో ఉండాల్సిన అమ్మాయిలు పొలంలో నాగలి మోస్తూ కనిపించడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నాడు. ఆ సమయంలో వెంటనే వారి వివరాలను కనుక్కొని చండీగఢ్‌లోని తన మిత్రుడు కిరణ్ గిల్హోత్రాకు ఫోన్ చేసి నాగేశ్వరరావుకు ట్రాక్టర్ పంపించే ఏర్పాట్లు చేయమని చెప్పానని గుర్తు చేసుకున్నాడు సోనూసూద్.