Narendra Modi : మమత పని అయిపోయినట్లే.. క్లీన్ బౌల్డ్, ఇప్పటికే బెంగాల్ ఎన్నికల్లో సెంచరీ కొట్టేశామన్న మోదీ
West Bengal Election : పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ ముమ్మర ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ...
West Bengal Election : పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ ముమ్మర ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ. బర్థమాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ బహిరంగసభల్లో పాల్గొన్నారాయన. బెంగాల్ఎన్నికల సంగ్రామంలో బీజేపీ ఇప్పటికే సెంచరీ కొట్టిందన్నారు ప్రధాని మోదీ. ఇక సీఎం మమత పని అయిపోట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. బర్థమాన్ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. నందిగ్రామ్‌లో మమత క్లీన్ బౌల్డ్అయ్యారని ఎద్దేవా చేశారు. ఇక బ్యాటిల్ గ్రౌండ్ నుంచి నిష్క్రమించాలని స్థానిక ప్రజలు మమతకు సూచించారని, బంగాల్‌లో లెఫ్ట్ కూటమికి పట్టిన గతే.. తృణమూల్ కాంగ్రెస్‌కు పడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్.. భారతీయా జనతా పార్టీ ఎన్నికల్లో నువ్వా..నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ప్రజల నుంచి మద్దతు కూడ గట్టేందుకు.. ఓట్లను కొల్ల గొట్టేందుకు ఎటువంటి అవకాశం దొరికినా వదలడం లేదు.
ఇటువంటి సమయంలో రెండు పార్టీలు ఇప్పుడు అక్కడ ‘మాటువా’ ఓట్ల కోసం తాపత్రయ పడుతున్నాయి. వారి ఓట్లను సంపాదించడానికి రెండు ప్రార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. టీవీ 9 ఎలక్షన్ ఇంటిలిజెన్స్ అండ్ రీసెర్చ్ వింగ్ లెక్కల ప్రకారం.. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో మాటువా తెగ వారు నాలుగు జిల్లాలోని 39 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు. స్థానిక జనాభాలో దాదాపు 20 శాతం మాటువ తెగ వారు ఉన్నారు. నదియా జిల్లాలో 10 నియోజకవర్గాల్లో, నార్త్ 24 పరాగణాల జిల్లాలో 9 నియోజకవర్గాల్లో, సౌత్ 24 పరగణ జిల్లాలో 12 నియోజకవర్గాలు, ఈస్ట్ బురుద్వాన్ జిల్లాలో 8 నియోజకవర్గాల్లోనూ మాటువా లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే తృణమూల్ కాంగ్రెస్, బీజీపీ రెండు పార్టీలు ఈ మాటువ తెగ వారి ఓట్ల కోసం పాకులాడుతున్నాయి. అందుకోసం కసరత్తులు చేస్తున్నాయి.