Tamil Nadu Election 2021: తమిళనాడు కాంగ్రెస్‌లో విషాదం.. కరోనాతో అభ్యర్థి మాధవరావు కన్నుమూత
Congress MLA candidate Madhava Rao: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలనే జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు జరిగి వారం రోజులు
Congress MLA candidate Madhava Rao: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలనే జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు జరిగి వారం రోజులు కూడా గడవక ముందే విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ అభ్యర్థి కరోనా బారిన పడి మరణించారు. విరుదునగర్ జిల్లాలోని శ్రీవిల్లిపుత్తూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పీఎస్‌డబ్ల్యూ మాధవరావు ఆదివారం మరణించారు. కాగా.. గత నెలలో మాధవరావు కరోనా వైరస్ బారిన పడ్డారు. అనంతరం ఆయనకు కరోనా నెగిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే.. తాజాగా మళ్లీ ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ఇన్‌ఛార్జి సంజయ్ దత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ నాయకుడు, శ్రీవిల్లిపుత్తూర్ పార్టీ అభ్యర్థి మాధవరావు చనిపోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. అంటూ సంజయ్‌దత్ ట్విట్ చేశారు. కాగా.. తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్ 6 వ తేదీన ఎన్నికలు జరిగాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం శ్రీవిల్లిపుత్తూర్‌లో ఒకవేళ మాధవరావు విజయం సాధిస్తే.. ఈ స్థానంలో మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుంది.
Also Read: