తమిళనాట టీటీవీ దినకరన్ పార్టీతో ఎంఐఎం పొత్తు ! మూడు నియోజకవర్గాల కేటాయింపు

తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ, ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తమ పార్టీని బరిలో దింపుతున్నారు. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం (ఎంఎంకె) తో...

  • Umakanth Rao
  • Publish Date - 7:44 pm, Mon, 8 March 21
తమిళనాట టీటీవీ దినకరన్ పార్టీతో ఎంఐఎం పొత్తు ! మూడు నియోజకవర్గాల కేటాయింపు

తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ, ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తమ పార్టీని బరిలో దింపుతున్నారు. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం (ఎంఎంకె) తో ఈ పార్టీ పొత్తును కుదుర్చుకుంది. ఈ విషయాన్ని దినకరన్ ట్విటర్ ద్వారా తెలియజేస్తూ ఎంఐఎం  కి మూడు సీట్లు కేటాయించామన్నారు. వణియంబాడి, క్రిష్ణగిరి, శంకరపురం నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ఎంఐఎం శాఖ తమ అభ్యర్థుల జాబితాను అసదుద్దీన్ ఒవైసీకి అందజేసిందని, రాష్ట్రంలో ఏయే సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టాలనుకుంటున్నదో అందులో  పేర్కొందని తెలుస్తోంది. తమిళనాడు నుంచి 20 స్థానాలు, పుదుచ్చేరిలో 2 సీట్లకు పోటీ చేయాలనుకుంటున్నట్టు స్పష్టం చేసినట్టు సమాచారం. కానీ చివరకు తమిళనాట కొన్ని సీట్లు మాత్రమే ఈ పార్టీకి   ఖరారైనట్టు తెలుస్తోంది. నిజానికి ఈ రాష్ట్రంలో డీఎంకేతో చేతులు కలపాలని మజ్లీస్ పార్టీ ఆసక్తి చూపినప్పటికీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మనితనేయ మక్కళ్ కచ్చి వంటి పార్టీలు ఇందుకు విముఖత చూపాయి.

బహుశా ఇందుకే మధ్యేమార్గంగా ఎంఐఎం ..దినకరన్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు  కనిపిస్తోందంటున్నారు. అటు-తమ నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తామని ఒవైసీ తెలిపారు. తమ సీనియర్ నేతలతో కూడా చర్చించాల్సి ఉందన్నారు. కానీ దినకరన్ మాత్రం సోమవారం నాడే ట్విటర్ ద్వారా ఈ విషయాన్నీ తెలియజేయడం విశేషం. అటు తమిళనాడులో తాము మూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఈ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు వకీల్ అహ్మద్ వెల్లడించారు. ఈ మూడు స్థానాల్లోనూ విజయం సాధించగలమన్న నమ్మకం తమకు ఉందన్నారు. దినకరన్ పార్టీతో పొత్తు  పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడులో ముస్లింలు ఎక్కువగా  ఉన్న ఈ నియోజకవర్గాలపై ప్రధానంగా ఎంఐఎం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఒవైసీ అధికారికంగా తన నిర్ణయాన్ని మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది.

2016 లో  జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థిగా వకీల్ అహ్మద్ ను నిలబెట్టింది. ఆయన సుమారు 10 వేల ఓట్లను సాధించారు. దాదాపు 6 శాతం ఓట్లను ఎంఐఎం చేజిక్కించుకోగలిగింది. అయితే ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే  అభ్యర్థి చేతిలో ఆయన ఓడిపోయారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.

నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోన్న తెలుగు తేజం పి .వి సింధు.:PV Sindhu Inspiration For Today’s Generation Youth video