Amit Shah Lunch: అమిత్ షా భోజనానికి వస్తున్నాడని ఎగిరి గంతేసిన అభ్యర్థి.. ఎన్ని రకాల వంటకాలు చేశారో తెలుసా?
Manipur Elections 2022: కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షా మణిపూర్ ఎన్నికల ప్రచారంలో కనిపించిన దృశ్యాలివి. తౌబాల్‌లో తమ పార్టీ అభ్యర్థి శ్యామ్ సింగ్ ఇంట్లో భోజనం చేశారు.
Amit Shah Lunch in Manipur Visits: కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ(BJP) అగ్రనేత అమిత్ షా మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల(Manipur Assembly Election 2022) ప్రచారంలో కనిపించిన దృశ్యాలివి. తౌబాల్‌లో తమ పార్టీ అభ్యర్థి శ్యామ్ సింగ్(Shyam Singh) ఇంట్లో భోజనం చేశారు. అమిత్‌షా లంచ్‌కు వస్తారని కన్ఫామ్ కాగానే.. ఉప్పొంగిపోయిన క్యాండిడేట్.. తన అభిమానాన్ని వంటకాల్లో చూపించారు. ఇలా తమ సంప్రదాయ పద్ధతిలో భోజనం వడ్డించారు. అరిటాకులో భోజనం పెట్టారు శ్యామ్ సింగ్. ఏకంగా 30 రకాల వంటకాలు సిద్ధం చేయించారు. వాటిని కూడా ఇతర పాత్రలు వాడకుండా.. అరటాకుతో చేసిన కప్పుల్లో వడ్డించారు. రాగి గ్లాసుల్లో తాగునీటిని అందించారు. పార్టీ అభ్యర్థి అభిమానానికి మస్త్ ఖుషీ అయ్యారు అమిత్‌షా. ఆయనతో పాటు మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, అసోం సీఎం బిశ్వశర్మ కూడా లంచ్ చేశారు. మణిపురి సంప్రదాయ వంటకాలను ఫుల్లుగా లాగించారు. అక్కడి వంటకాలకు ఫిదా అయ్యారు అమిత్ షా. అడిగి మరీ వడ్డించుకున్నారు. టేబుల్ మీల్స్, బఫే సిస్టమ్ కాకుండా.. నేలపై కూర్చుని.. సంప్రదాయ పద్ధతిలో భోజనం చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. టేస్ట్ అదిరిపోయిందంటూ కితాబిచ్చారు.
60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 28న జరిగిన తొలిదశ పోలింగ్‌లో స్వల్పంగా హింస చోటు చేసుకుంది. సెకండ్ ఫేజ్‌కు రేపటితో ప్రచారం ముగుస్తుంది. 5న పోలింగ్ జరుగుతుంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కమలనాథులు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. తౌబాల్‌లో పార్టీ అభ్యర్థి ఇంట్లో బీజేపీ అగ్రనేతల సంప్రదాయ భోజనం కూడా తమకు ఉపయోగపడుతుందని.. లోకల్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కేడర్ ఖుషీగా ఉంది.
Manipur | Union Home Minister Amit Shah along with Assam CM Himanta Biswa Sarma and Manipur CM N Biren Singh had lunch at the house of BJP candidate Shyam Singh in Thoubal#ManipurElections2022 pic.twitter.com/s3zR0i2K82
— ANI (@ANI) March 1, 2022
Read Also…. Telangana: ఇదేం బాదుడు బాబోయ్.. తెలంగాణలో షాక్ కొడుతోన్న కరెంట్ బిల్లులు.. లబోదిబోమంటోన్న వినియోగదారులు..