Telangana: ఇదేం బాదుడు బాబోయ్‌.. తెలంగాణలో షాక్‌ కొడుతోన్న కరెంట్‌ బిల్లులు.. లబోదిబోమంటోన్న వినియోగదారులు..

Electricity bills: అదే కరెంట్‌.. అదే వాడకం.. కానీ బిల్లు మాత్రం గుండెలు బాదుకునేలా చేస్తోంది. ఇన్నాళ్లూ ఓ లెక్క ఇప్పుడో లెక్క అంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరుతో బాదుడుకి తెరతీశారు.

Telangana: ఇదేం బాదుడు బాబోయ్‌.. తెలంగాణలో షాక్‌ కొడుతోన్న కరెంట్‌ బిల్లులు.. లబోదిబోమంటోన్న వినియోగదారులు..
Follow us

|

Updated on: Mar 02, 2022 | 2:45 PM

Electricity bills: అదే కరెంట్‌.. అదే వాడకం.. కానీ బిల్లు మాత్రం గుండెలు బాదుకునేలా చేస్తోంది. ఇన్నాళ్లూ ఓ లెక్క ఇప్పుడో లెక్క అంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. డెవలప్‌మెంట్‌ ఛార్జీల పేరుతో బాదుడుకి తెరతీశారు. ఈ బాదుడు దెబ్బకి సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు. వందల బిల్లు వేలకు చేరితే చెల్లించేదెలా అని బోరుమంటున్నాడు. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్ సహా ఎక్కడ చూసినా విద్యుత్ బిల్లులపైనే చర్చ నడుస్తోంది. ఇంతకుముందు నెలకి 2,3 వందలొచ్చే కరెంట్‌ బిల్‌.. ఈసారి రూ.4 వేలు వచ్చేసరికి వినియోగదారులు షాకవుతున్నారు. ఏంటీ బిల్లు..? ఎందుకిలా వస్తోందంటూ గుండెలు బాదుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఏ ఇంటి తలుపు తట్టినా వీర బాదుడు లొల్లే. విద్యుత్ బిల్లు చూసి కరెంట్ ఆఫీస్‌కి పరుగులు తీస్తున్నారు జనం. లిమిటెడ్‌ యూనిట్స్‌ విద్యుత్‌ వాడినా.. బిల్‌ మాత్రం వేలల్లో ఎందుకు వస్తుందని అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. అసలు కరెంట్‌ బిల్ ఎందుకు పెరిగింది.. అందులో ఏమేం యాడ్‌ చేశారో చూద్దాం.

డెవలప్‌మెంట్‌ బిల్ అంటూ..

కొత్తగా డెవలప్‌మెంట్‌ బిల్ ఏంటి? గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకిలా బాదుతున్నారన్నది అర్థంకాని ప్రశ్నగా మారింది. వేలల్లో ఉన్న కరెంట్ బిల్లుల్ని చూసి సామాన్యులు ఘోల్లుమంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ రేకుల షెడ్డులో ఉండే తమకు ఇంత బిల్లు వస్తే ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల వాళ్లు పెద్ద మొత్తంలో వచ్చిన బిల్లులను చెల్లించలేకపోతున్నారు. ఆర్థిక స్థోమతలేని వాళ్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అప్పుచేయాల్సి వస్తోందంటున్నారు. అధికారులు మాత్రం అయిదారు వాయిదాలు తీసుకున్నా ఫర్వాలేదు. కానీ బిల్‌ మాత్రం చెల్లించాల్సిందేనని చెబుతున్నారు.

వందల నుంచి వేలల్లో..

నిజామాబాద్ జిల్లాలో కూలీ పనిచేసుకునే ఓ వ్యక్తికి ఇంతకుముందు నెలకి రూ. 400 కరెంట్ బిల్లు వచ్చేది. ఈ సారి 4వందల బిల్లుతో పాటు డెవలప్‌మెంట్‌ ఛార్జీలతో కలిపి 3వేల బిల్లు వచ్చింది. కూలీ పని చేసుకునే వాళ్లకు సైతం వేలల్లో కరెంట్‌ బిల్లులు వస్తున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని తమకు అధిక మొత్తంలో బిల్లులు వేయడమేంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వినియోగిస్తున్నట్టుగానే ఇప్పుడు విద్యుత్ వినియోగిస్తున్నాం. మరి ఛార్జీల్లో మాత్రం అంత తేడా ఎందుకొస్తుందని ప్రశ్నిస్తున్నారు. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల వాళ్లు పెద్ద మొత్తంలో వచ్చిన బిల్లులను చెల్లించలేకపోతున్నారు. ఆర్థిక స్థోమతలేని వాళ్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అప్పుచేయాల్సి వస్తోందంటున్నారు. అధికారులు మాత్రం అయిదారు వాయిదాలు తీసుకున్నా ఫర్వాలేదు. కానీ బిల్‌ మాత్రం బరాబర్‌ చెల్లించాల్సిందేనని చెబుతున్నారు.

Electricity Bil

Also Read:Sreemukhi: పరువాలతో సెగలు పుట్టిస్తున్న యాంకర్ శ్రీముఖి.. అదిరిన పిక్స్

అదిరే అందాలతో కవ్విస్తోన్న యాంకర్ రష్మి గౌతమ్

TDP – JSP: భీమ్లా నాయక్‌కు టీడీపీ సపోర్ట్ అందుకేనా..? ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌.. ఆశ్చర్యంలో జనసేన వర్గాలు..!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో