Karnataka Elections: కర్నాటక ప్రచార పర్వంలో గణనీయమైన మార్పు.. రెండంశాల కారణంగా క్యాంపెయిన్ పాటర్న్ ఛేంజ్

రెండు ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్ తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేసిన తర్వాత ప్రచార పర్వంలో గణనీయమైన మార్పు వచ్చింది అని చెప్పవచ్చు.

Karnataka Elections: కర్నాటక ప్రచార పర్వంలో గణనీయమైన మార్పు.. రెండంశాల కారణంగా క్యాంపెయిన్ పాటర్న్ ఛేంజ్
Karnataka Elections
Follow us
Rajesh Sharma

|

Updated on: May 05, 2023 | 9:05 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా క్యాంపెయిన్ పాటర్న్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా రెండు ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్ తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేసిన తర్వాత ప్రచార పర్వంలో గణనీయమైన మార్పు వచ్చింది అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో భజరంగ్ దళ్‌ని నిషేధిస్తామని ప్రస్తావించడం ప్రచార పర్వంలో మార్పు రావడానికి కారణాల్లో ఒకటి అయితే రెండో కారణం ది కేరళ స్టోరీ సినిమా. ఈ సినిమాపై జాతీయస్థాయిలో రకరకాల చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బళ్లారిలో జరిగిన బహిరంగ సభలో ఈ సినిమా పేరును ప్రస్తావించి ఉగ్రవాదంపై నిప్పులు చెరిగారు. ఉగ్రవాద సంస్థలు మహిళలను ఎలా వాడుకుంటున్నాయో ఈ సినిమా ద్వారా బహిర్గతం అయ్యిందని, ఉగ్రవాద సంస్థల కుట్రలు ఎలా ఉంటాయో ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే ది కేరళ స్టోరీ మూవీ ఒక కట్టు కథ అని అంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇంకొంతమంది బిజెపి వ్యతిరేక వ్యక్తులు ఈ సినిమా ద్వారా బిజెపి లబ్ధి పొందాలని అనుకుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో కర్ణాటక ఎన్నికల ప్రచార పర్వంలో ఈ బాలీవుడ్ మూవీ ఒక అంశంగా మారింది. ఏకంగా ప్రధాని నోట ఈ సినిమా పేరు రావడంతో ఆ సినిమా ప్రమోషన్ కు బాగానే ఉపయోగపడిందని చెప్పొచ్చు. అదే సమయంలో ఉగ్రవాద సంస్థల దుశ్చర్యలను కూడా ప్రచార పర్వంలో బిజెపి పెద్ద ఎత్తున ప్రస్తావించేందుకు అనుకూలత ఏర్పడింది. కర్ణాటకకు, కన్నడ ప్రజలకు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ బిజెపి నేతలు సమాజంలో చీలికకు ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రచారాంశాల్లో మార్పు

ఇక కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో భజరంగ్ దళ్‌ని నిషేధిస్తామని చెప్పడం రాజకీయ రగడకు తెరలేపింది. కాంగ్రెస్ మేనిఫెస్టో వెలువడిన మర్నాడు ప్రధానమంత్రి తన సభలలో భజరంగబలికీ జై అంటూ నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. తద్వారా హిందూ ఓటర్లకు గాలమేసేందుకు మోదీ వ్యూహరచన చేసినట్లు అర్థమవుతుంది. మోదీ ప్రసంగాలలో భజరంగ బలి నినాదం ఎప్పుడైతే మొదలయ్యిందో.. కర్ణాటకలోని వీధి వీధి ప్రచారంలో బిజెపి నేతలు ఈ మేరకు నినాదాలు చేస్తూ వెళుతున్నారు. ఒక్క కర్ణాటకలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల ఎదుట భజరంగబలికీ జై అంటూ బిజెపి, భజరంగ్ దళ్ కార్యకర్తలు హల్‌చల్ చేస్తున్నారు. వీటన్నింటి ప్రభావం కర్ణాటక ఓటర్ల మీద పడేలా బిజెపి శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఆ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలు కాకుండా ఇప్పుడు ఉగ్రవాదం, హిందుత్వం వంటి అంశాలు ప్రధాన అంశాలుగా మారిపోయాయి. దాంతో మే రెండవ తేదీ నుంచి ప్రచార పర్వంలో గణనీయమైన మార్పు వచ్చేసింది. ఈ ప్రచార సరళి ఏ పార్టీకి లాభిస్తుందో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సెంట్రల్ కర్ణాటకపైనే నజర్

మే పదవ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్, ఇటు బిజెపి ఏఏ ప్రాంతాలలో తమకు ఎక్కువ సీట్లు వస్తాయో అన్న అంచనాలను వేసుకోవడం మొదలుపెట్టాయి. దానికి అనుగుణంగా ప్రచార పర్వంలో మార్పు చేసుకుంటున్నాయి. ఎక్కడ తమ పార్టీ వీక్ గా ఉందో అక్కడ పార్టీ ప్రధాన నేతల పర్యటనలు జరిపేలా ప్రణాళిక రచిస్తున్నాయి. సెంట్రల్ కర్ణాటకపైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ప్రధానంగా దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా మధ్య కర్నాటక ప్రాంతంలో బిజెపినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. లింగాయతుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సెంట్రల్ కర్ణాటకలో బిజెపి హవా నడుస్తూ వస్తుంది. 2013లో యడియూరప్ప కర్ణాటక జనతా పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టిన సందర్భంలో తప్ప సెంట్రల్ కర్నాటకలో బిజెపిదే పైచేయి. ఈ ప్రాంతంలోని చిత్రదుర్గ, తుమకూరు, శివమొగ్గ, దావణగిరి జిల్లాలలో లింగాయత్ సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 32 అసెంబ్లీ సీట్లు ఉండగా 8 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈ ప్రాంతంపైన కాంగ్రెస్ పార్టీ ఈసారి గంపెడాశలు పెట్టుకుంది. లింగాయతులు తమవైపు తిరిగారని.. ఎస్సీ, ఎస్టీ ఓట్లు కూడా తమకేనని కాంగ్రెస్ నేతలు భరోసాతో ఉన్నారు.

బీజేపీని ఇబ్బంది పెడుతున్న అంశాలివే

నిజానికి ఈ ప్రాంతంలో 2004వ సంవత్సరం దాకా కాంగ్రెస్ పార్టీ, బిజెపితో నువ్వా నేనా అన్నట్లు ఉండేది. 2004 ఎన్నికల్లో హిందువుల ఓట్లను పోలరైజ్ చేయడంలో బిజెపి సక్సెస్ అయ్యింది. అప్పటినుంచి సెంట్రల్ కర్ణాటక ఏరియాలో బిజెపిదే పై చేయిగా కొనసాగుతోంది. ఈసారి ఈ ప్రాంతంలో సీట్లను గణనీయంగా పెంచుకునే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది. దానికి అనుగుణంగానే పార్టీ ప్రధాన నేతలు ఈ ప్రాంతం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రచార పర్వంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన అంశాలను ఇరు పార్టీలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. స్థానిక సమస్యలపై గత ఐదేళ్ల కాలంలో బిజెపి నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఈ ప్రాంతంలో బగర్ హుకుం భూ స్వాధీనం, శరావతి ప్రాజెక్టు పునరావాసం, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ మూసివేత వంటి అంశాలు బిజెపికి ఇప్పుడు ఇబ్బందిగా మారాయి. కాఫీ సాగుదారులను ఆదుకోలేదన్న అపప్రద చికమంగళూరు ఏరియాలో వినిపిస్తోంది. భద్ర ఎత్తిపోతల ప్రాజెక్టు అంశం చిత్రదుర్గ జిల్లాలో కీలక అంశంగా మారింది. అయితే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 5,300 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడంతో ఆ అంశాన్ని బిజెపి నేతలు ప్రచారంలో ప్రధానంగా వాడుకుంటున్నారు. ఇది బీజేపీకి కొంత అనుకూలంగా కనిపిస్తోంది. సెంట్రల్ కర్ణాటకలో ఎక్కువ సీట్లు రావాలని వ్యూహరచన చేసిన కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దావణగిరిలో తన 75వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొని, అక్కడి నుంచే ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. బిజెపి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెంట్రల్ కర్ణాటక ప్రాంతంలోనే అత్యధికంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రాంతంలో పెద్దగా పట్టు లేనప్పటికీ జనతాదళ్ సెక్యులర్ పార్టీ తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు తుమకూరులో శ్రమిస్తోంది.

నాలుగు జిల్లాల్లో పరిస్థితి ఇది

మొత్తం మీద నాలుగు జిల్లాలు 32 అసెంబ్లీ సీట్లు సెంట్రల్ కర్ణాటకలో ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే దావణగిరి జిల్లాల్లో ఎనిమిది, శివమొగ్గ జిల్లాలో ఏడు, చిత్రదుర్గ జిల్లాలో ఆరు, తుమకూరు జిల్లాలో పదకొండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాలలో 2018 నాటి ఎన్నికలలో 32 సీట్లకు గాను 21 సీట్లను బిజెపి గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏడు సీట్లు గెలుచుకుంది. తుమకూరు జిల్లాలో మాత్రమే పట్టున్న జేడిఎస్ పార్టీ ఆ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగింది. తాజాగా మారిన ఎన్నికల ప్రచార సరళి సెంట్రల్ కర్ణాటక పై ఎక్కువ ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. భజరంగ్ దళ్‌పై నిషేధం, ది కేరళ స్టోరీ ఉగ్రవాద కుట్రల ప్రభావం సెంట్రల్ కర్ణాటకపై అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఏ పార్టీ జాతకం ఎలా వుందో తెలియాలంటే మే పదమూడవ తేదీ దాకా ఆగాల్సిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి మూవీ హీరో.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి మూవీ హీరో.
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పార్శల్‌లో డెడీ బాడీ.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన పోలీసులు
పార్శల్‌లో డెడీ బాడీ.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన పోలీసులు
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో