Karnataka Elections: మరికొద్దిసేపట్లో పెళ్లి.. పెళ్లికూతురుగా ముస్తాబై ఓటు వేసిన యువతి
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు కన్నడ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జీడీఎస్ మధ్యే ప్రధానంగా పోరు నడుస్తోంది. మొత్తం 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఓటింగ్ కోసం 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు కన్నడ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జీడీఎస్ మధ్యే ప్రధానంగా పోరు నడుస్తోంది. మొత్తం 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఓటింగ్ కోసం 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో చిక్కమగళూరు జిల్లా మకోనహల్లి గ్రామానికి చెందిన యువతి ఈరోజు పెళ్లి చేసుకోనుంది. అయితే మరికొన్ని గంటల్లో పెళ్లి ఉండటంతో ఏకంగా పెళ్లికూతురు చీరలోనే ముస్తాబై పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటును వినియోగించుకుంది. ముదిగేరే అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.
మరోవైపు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తి బెంగళూరులోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే యువత ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలంటూ సుధామూర్తి సందేశం కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా 224 అసెంబ్లీ సీట్ల కోసం జరగనున్న ఈ కర్నాటక ఎన్నికల్లో ఏ పార్టీ అయినా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 సీట్లలో గెలవాల్సి ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..