Assembly Elections 2022: యూపీలో ఈ దశే కీలకం.. మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్..
Uttar Pradesh, Uttarakhand, Goa Assembly Elections 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలలో ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
Uttar Pradesh, Uttarakhand, Goa Assembly Elections 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలలో ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్ (UP) లో ఇది రెండో దశ పోలింగ్ కాగా, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఒకేదశలో పోలింగ్ పూర్తి కానుంది. రెండో విడతలో ఉత్తర ప్రదేశ్‌లో 55, ఉత్తరాఖండ్ (Uttarakhand) లో 70, గోవా (Goa) లో 40 స్థానాలకు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పోలింగ్ కొనసగుతుంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
యూపీలో సెకండ్ ఫేజ్లో సహారన్పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బుదౌన్, బరేలీ, షాజహాన్పూర్ జిల్లాలో పోలింగ్ జరుగుతుంది. 586 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో విడతలో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. సమాజ్వాదీకి ఈ ప్రాంతంలో మంచి పట్టుంది. ఎస్పీ నేత మహమ్మద్ ఆజం ఖాన్తో పాటు ధరమ్ సింగ్ సైనీ, యూపీ ఫైనాన్స్ మినిస్టర్ సురేశ్ ఖన్నా ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆజంఖాన్ రాంపూర్ సీటు నుంచి పోటీ చేస్తుండగా.. సురేశ్ ఖన్నా షాజహాన్ పూర్, సైనీ నకుడ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో ఉన్నారు. ఆజం ఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజం స్వర్ సీటు నుంచి పోటీలో ఉన్నారు.
ఉత్తరాఖండ్..
ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 632 మంది బరిలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు చేరేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై మంచు పేరుకుపోవడంతో అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. ఉత్తరాఖండ్ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
గోవాలో
గోవా రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. అయితే ఈసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ గట్టిగానే ఉంది. అధికార పార్టీ బీజేపీకి, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు పలు విపక్షాల నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. గోవాలో బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ పడుతున్నాయి. మొత్తం 301 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కుమారుడు ఉత్పల్ పారికర్ తన తండ్రి సంప్రదాయ పనాజీ అసెంబ్లీనుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పనాజీ అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడంతో ఉత్పల్ బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ పనాజీ స్థానం నుంచి అటానాసియో బాబూష్ మాన్‌సెరేట్‌ను బరిలోకి దింపింది.
Also Read: