గొంతు కోసుకోవడం కంటే ఉరేసుకుంటే త్వరగా చస్తావు.. ప్రియురాలికి ఉచిత సలహా ఇచ్చిన ప్రియుడు..
ఆన్‌లైన్ పరిచయాల వల్ల మోసపోయి ఇటీవల చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. సరదాగా ప్రారంభమైన చాటింగ్, టాకింగ్ తర్వాత చాలా ఇబ్బందులను

ఆన్‌లైన్ పరిచయాల వల్ల మోసపోయి ఇటీవల చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. సరదాగా ప్రారంభమైన చాటింగ్, టాకింగ్ తర్వాత చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఒక్కోసారి ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. అయినప్పటికీ యువత మారడం లేదు. సోషల్ మీడియాకు బానిసై అపరిచితులకు తన సమాచారం చేరవేసి ఆపదలో చిక్కుకుంటున్నారు. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మి మోసపోయింది ఓ యువతి. అనంతరం అతడి వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడుకు చెందిన ముత్తు కుమారేశన్‌కు వీడియో చాటింగ్ యాప్‌లో పెరంబక్కమ్‌కు చెందిన భారతి అనే యువతి పరిచయమైంది. తర్వాత ఇద్దరు మంచి మిత్రులయ్యారు అనంతరం ప్రేమికులయ్యారు. కలిసి మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం కూడా జరిగింది. ఇంతలో అతడికి ఇదివరకే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. దీంతో షాకైన భారతి అతడిని అవైడ్ చేస్తూ వచ్చింది కానీ అతడు మాత్రం వినలేదు. తనను పెళ్లిచేసుకోమని వెంటపడ్డాడు. లేదంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఎలాగైనా తనను దక్కించుకోవాలనుకున్నాడు. నిత్యం వేధించటం మొదలుపెట్టాడు. దీంతో చివరిసారిగా అతడికి వార్నింగ్ ఇద్దామని భావించిన యువతి అతడికి వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఇకనుంచి తనను ఇబ్బందిపెడితే ఆత్మహత్య చేసుకుంటానని చేతిలో కత్తి పట్టుకొని బెదిరించింది. అయినా వినని కుమారేశన్ ఆమెను ఎగతాళి చేస్తూ గొంతుకోసుకోవడం కన్నాఉరేసుకుంటే త్వరగా చస్తావని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి వీడియో కాల్‌లోనే ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆమె ఫోన్‌లో రికార్డయింది. వీడియో బయటికి రావడంతో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.



