కరీంనగర్ జిల్లా జ్యోతి నగర్‌లో పెను విషాదం.. అప్పుల బాధతో పురుగుల మందు తాగిన కుటుంబం..
కరీంనగర్ జిల్లాలోని జ్యోతి నగర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

suicide
కరీంనగర్ జిల్లాలోని జ్యోతి నగర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గమనించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్యభర్తలిద్దరు కృష్ణవేణి, సమ్మయ్య మృతి చెందారు. కొడుకు మోక్షజ్ఞ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతన్ని వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. అప్పుల బాధల వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.




