AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసు పెట్టడానికి స్టేషన్‌కొస్తే మహిళా అని చూడకుండా బెల్టు తీసి కొట్టాడు.. అసభ్య పదజాలంతో తిడుతూ అవమానించాడు..

కంప్లెంట్ ఇవ్వడానికి వచ్చిన ఓ యువతిని బెల్టుతో కొట్టాడు ఓ బుద్ధిలేని ఎస్సై. దీంతో ఆ యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై వేటుపడింది.

కేసు పెట్టడానికి స్టేషన్‌కొస్తే మహిళా అని చూడకుండా బెల్టు తీసి కొట్టాడు.. అసభ్య పదజాలంతో తిడుతూ అవమానించాడు..
uppula Raju
|

Updated on: Dec 07, 2020 | 6:47 PM

Share

కంప్లెంట్ ఇవ్వడానికి వచ్చిన ఓ యువతిని బెల్టుతో కొట్టాడు ఓ బుద్ధిలేని ఎస్సై. దీంతో ఆ యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై వేటుపడింది. తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన వనిత ఆటో నడుపుతూ బతుకుతుంది. తన ఇంటిలోకి తుమ్మలగుంట కాలనీకి చెందిన కొందరి గేదెలు వచ్చి గార్డెన్‌ను నాశనం చేస్తున్నాయి. గమనించిన వనిత పశువులను వెళ్లనివ్వకుండా గేటు వేసి వాటి యజమానులతో గొడవకు దిగింది. ఇది మళ్లీ పునరావృతం కాకుండా ఉండటానికి ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెంట్ ఇవ్వడానికి వెళ్లింది. అయితే ఆమె వెళ్లేసరికి స్టేషన్ గదులు మొత్తం అప్పుడే కడిగి పూజ చేయడానికి సిబ్బంది సిద్దంగా ఉంచారు. బాధితురాలు చూసుకోకుండా లోపలికి వెళ్లడంతో అక్కడున్న ఎస్సై ప్రకాశ్ రాజ్ ఆగ్రహంతో ఆమెను తిట్టాడు. దీంతో వనిత ఎందుకు తిడుతున్నావని అడిగినందుకు కోపోద్రిక్తుడై బెల్టు తీసి మరీ కొట్టాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిన యువతి నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఎస్పీ లేకపోవడంతో ఎంఆర్‌పల్లి స్టేషన్‌కు చేరుకొని ధర్నాకు దిగింది. అక్కడ కూడా ఓ మహిళా పోలీసు ఆమెను బండ బూతులు తిట్టిందని వాపోయింది. దీంతో స్పందించిన అదనపు ఎస్పీ సుప్రజ నివేదికను ఎస్పీ రమేశ్‌రెడ్డి‌కి అందించడంతో ఆయన విచారణ జరిపి ఎస్సై ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకున్నారు.

Follow Us
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా.
విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా.
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!