విశాఖలో పెట్రోల్ దాడికి యత్నం..తృటిలో తప్పించుకున్న ఏఎంహెచ్‌వో

విశాఖలోని జీవీఎంసీ కార్యాలయంలో ఓ మహిళ పెట్రోల్ దాడికి యత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. స్థానిక జీవీఎంసీ జోన్ 6వ నెంబర్ పరిధిలోని కార్యాలయంలో పెట్రోల్ దాడి ఘటన...

విశాఖలో పెట్రోల్ దాడికి యత్నం..తృటిలో తప్పించుకున్న ఏఎంహెచ్‌వో
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 07, 2020 | 2:06 PM

విశాఖలోని జీవీఎంసీ కార్యాలయంలో ఓ మహిళ పెట్రోల్ దాడికి యత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. విశాఖలోని జీవీఎంసీ జోన్ 6వ నెంబర్ పరిధిలోని కార్యాలయంలో పెట్రోల్ దాడి ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గోపాలపట్నం పరిధిలో శానిటరీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అన్నామణి అనే మహిళ..ఏఎంహెచ్‌వో లక్ష్మీతులసి పై పెట్రోల్ దాడికి యత్నించింది. ఈ ఘటనలో ఏఎంహెచ్‌వో లక్ష్మీతులసి ప్రమాదం నుంచి త‌ృటిలో తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను వారించటంతో ప్రమాదం తప్పింది. అయితే, అసలు విషయం పరిశీలించగా…

శానిటరీ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న అన్నామణి తనకు రావాల్సిన వేతనంలో కోత విధించారని ఆరోపిస్తోంది.. దాంతో ఆవేదనకు గురైన అన్నామణి ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే, అన్నామణి గతంలో 20 రోజుల పాటు విధులకు హాజరు కాకుండా సెలవు పెట్టిందని అందుకే, తన జీతంలో  కోత విధించాల్సి వచ్చిందని ఏఎంహెచ్ అధికారి లక్ష్మీ తులసి వాదన. దీంతో తనపై కక్ష్య పెంచుకున్న అన్నామణి ఇలా పెట్రోల్‌తో ఎటాక్ చేసిందని ఆరోపించింది. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారుల సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.

మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..