నకిలీ విజయ్ దేవరకొండని అరెస్ట్ చేసిన పోలీసులు
హీరో విజయ్ దేవరకొండ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిల్ని మోసం చేస్తోన్న.. నకిలీ విజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన..
హీరో విజయ్ దేవరకొండ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిల్ని మోసం చేస్తోన్న.. నకిలీ విజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఫేమ్‌ని.. అంతకుమించిన ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు. ఈ ఫేమ్‌ని గ్రహించిన ఓ కేటుగాడు.. హీరో విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు. విజయ్ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. తనను కలవాలంటే ఫలానా నెంబర్‌కి ఫోన్ చెయ్యాలంటూ అజ్ఞాత వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నాడు. ఇది నిజమేనని నమ్మిన చాలామంది అమ్మాయిలు.. ఆ వ్యక్తితో చాటింగ్ చేసి మోసపోతున్నారు.
అయితే ఇది విజయ్ దృష్టికి చేరగా.. ఈసారి హీరోనే స్వయంగా రంగంలోకి దిగి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చాటింగ్ చేశారు. అలాగే మెల్లగా అతన్ని ట్రాప్ చేసి.. ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఓ మిమిక్రీ ఆర్టిస్ట్‌తో ఫోన్ మాట్లాడించి.. హైదరాబాద్‌కి రమ్మన్నాడు. ఇదే లక్కీ ఛాన్స్ అనుకున్న కేటుగాడు హైదరాబాద్ వచ్చాడు. వచ్చీరాగానే పోలీసులు అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
ఆ నకిలీగాన్ని విచారించగా.. అసలు విషయాలు బయటపెట్టాడు. తనది కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రాంతానికి చెందిన వాడినని, విజయ్ దేవరకొండ అంటే.. అమ్మాయిలు పడిచచ్చిపోతున్న విషయాన్ని గ్రహించానని.. అందుకే ఇలా నకిలీ అకౌంట్ క్రియేట్ చేసినట్టు తెలిపాడు. అలాగో మరో ఇద్దరి హీరోల పేర్లతో కూడా అకౌంట్లు తెరిచినట్లు వివరించాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. నకిలీ అకౌంట్లను నమ్మవద్దని కోరారు. అలాగే హీరో విజయ్ టీం కూడా.. విజయ్‌కి ఫేస్ బుక్ అకౌంట్ లేదని.. దయచేసి నకిలీల ట్రాప్‌లో పడొద్దని తెలిపారు.