AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పిపోయిన కుక్కను వెతికిపట్టుకున్న పోలీసులు..

కుక్క తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తికి కేవలం వారం రోజుల వ్యవధిలోనే దాన్ని తిరిగి యజమానికి అప్పగించారు పోలీసులు..ఈ సంఘటన..

తప్పిపోయిన కుక్కను వెతికిపట్టుకున్న పోలీసులు..
Jyothi Gadda
|

Updated on: Mar 07, 2020 | 1:16 PM

Share

మనుషులు తప్పిపోతే కనిపెట్టడం ఈ రోజుల్లో చాలా కష్టం. మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత రోజులు గడిచినా కొన్ని సార్లు వారి ఆచూకీ లభించకపోవటంతో పోలీసులు ముప్పుతిప్పలు పడాల్సి వస్తుంది. కానీ, అక్కడి పోలీసులు..మాత్రం తమ కుక్క తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తికి కేవలం వారం రోజుల వ్యవధిలోనే దాన్ని తిరిగి యజమానికి అప్పగించారు. ఈ విచిత్ర సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది…

కుషాయగూడకు చెందిన ఒక వ్యక్తి తన పెంపుడు కుక్క కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాము ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పప్పి మిస్సై అయిందని..ఎలాగైన వెతికి పెట్టాల్సిందిగా పోలీసులను కోరాడు. కుక్కకు సంబంధించిన ఫోటోను కూడా పోలీసులకు ఇచ్చాడు. ఆ ఫోటో ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. క్రైమ్ టీం సాయంతో వారంరోజుల పాటు గాలించిన పోలీసులు తప్పిపోయిన కుక్కపిల్లను పట్టుకున్నారు. దాని యజమానికి ఫోన్ చేసి కుక్కపిల్లను అప్పగించారు. దీంతో దాని యజమాని సంతోషం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ కేసులతో బిజీగా ఉండే పోలీసులు తన కోసం కష్టపడిన కుక్కను తీసుకురావడంతో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర