AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాండూరులో వివాహిత అనుమానాస్పద మృతి.. భర్త, అత్తామామ వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు

తాండూరు పట్టణంలోని ఖాన్ కాలనీలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాండూరులో వివాహిత అనుమానాస్పద మృతి.. భర్త, అత్తామామ వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు
Balaraju Goud
|

Updated on: Feb 15, 2021 | 7:04 PM

Share

Woman suspected death : వికారాబాద్ జిల్లాలో వివాహిత అనుమాస్పదస్థితిలో మృతి చెందింది. తాండూరు పట్టణంలోని ఖాన్ కాలనీలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ నగరంలోని మొయిన్‌బాగ్‌కు చెందిన బుస్రా పర్వీన్ (26)ను వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ అత్తర్ కుమారుడు అశ్వక్ హైమద్‌తో 6 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇదిలావుంటే, పని పాట లేకుండా తిరిగే పర్వీన్ భర్త తరచూ అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. ఇలా రెండేళ్లక్రితం భార్య వేధింపులు భరించలేక పర్వీన్ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌లో భర్త పై వరకట్నం వేధింపుల కేసు పెట్టారు. నయానా భయానా చెప్పి భార్యను కాపురానికి తీసుకొచ్చిన హైమద్ తిరిగి అదే పంథాను కొనసాగించాడు. అయితే, గతవారం రోజుల నుండి తమ కూతుర్ని తీవ్రంగా వేధింపులకు గురి చేశారని, తమకు చెప్పకుండా తమ కూతురు లోలోన తీవ్ర మనోవేదనకు గురి అయిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం తమ కూతురికి హార్ట్ ఎటాక్ వచ్చిందని ఓసారి సమాచారం ఇచ్చారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత కొంత సేపటికి ఆత్మహత్య చేసుకుందని అనుమానాలకు దారి తీసే విధంగా తాము వచ్చే వరకు ఆగకుండా తమ కూతురు శవాన్ని తాండూరు జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారని బాధితులు వాపోయారు. సంఘటనా స్థలానికి పోలీసులు రాకుండానే శవాన్ని తరలించడంపై కుటుంబసభ్యలు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు, ఆపై తమ కూతురిని వేధించిన భర్త అత్తమామల పై కేసు నమోదు చేయకుండా తమపై తాండూర్ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

తమ కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కాని ఇది ముమ్మాటికీ ఇది హత్యే నని భర్త అత్తమామల పై కేసు నమోదు చేయడంపై తాండూరు పోలీసులు తాత్సరం చేశారని పర్వీన్ కుటుంబసభ్యులు ఆరోపించారు. తమకు స్థానిక పోలీసులపై నమ్మకం లేదని ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కు బదిలీ చేసి విచారణ జరిపించాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరుతున్నారు.

ఇదీ చదవండి… ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…