ఎంగేజ్‌మెంట్ అని పార్టీకి పిలిచి.. యువతిపై ముగ్గురు అత్యాచారం
ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. ఎంగేజ్‌మెంట్ పార్టీ అని పిలిచి, ఓ యువతిపై ముగ్గురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు
woman molested Mumbai: ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. ఎంగేజ్‌మెంట్ పార్టీ అని పిలిచి, ఓ యువతిపై ముగ్గురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 8న జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ ముంబయికి చెందిన అవినాశ్ పంగేకర్(28) అనే వ్యక్తికి కొన్నిరోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో పార్టీ ఇస్తున్నానంటూ తన స్నేహితులు శిశిర్, తేజస్‌లతో పాటు మరో ముగ్గురు యువతులను పార్టీకి పిలిచాడు. (కరోనాకి వ్యాక్సిన్ రాకపోవచ్చు.. కీలక వ్యాఖ్యలు చేసిన బాలయ్య)
ఈ నేపథ్యంలో అంధేరీలో- కర్లా రోడ్డులో గల హోటల్‌లో పార్టీ చేసుకున్న అనంతరం అవినాశ్, శిశిర్, తేజస్ ముగ్గురు కలిసి ఓ యువతిపై అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఆ తరువాత ఇంటికి వెళ్లిన ఆ యువతి.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వెళ్లడించింది. వారి మద్దతుతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పార్టీలో మద్యం సేవించాల్సిందిగా తనను బలవంతం చేసి, ఆపై అకృత్యానికి ఒడిగట్టారని బాధితురాలు వాపోయింది. తనతో పాటు వచ్చిన ఇద్దరు మహిళలను ఇంటికి పంపి, తనపై అత్యాచారం చేశారని తెలిపింది. ఇక ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే బాధితురాలిని ఆసుపత్రికి పంపి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. (బాలయ్య-నాగశౌర్య మల్టీస్టారర్.. కాంబోను సెట్ చేసిన ప్రముఖ నిర్మాత..!