కరోనాకి వ్యాక్సిన్ రాకపోవచ్చు.. కీలక వ్యాఖ్యలు చేసిన బాలయ్య

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ వ్యాక్సిన్ వస్తేనే మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని అందరూ బలంగా నమ్ముతున్నారు.

కరోనాకి వ్యాక్సిన్ రాకపోవచ్చు.. కీలక వ్యాఖ్యలు చేసిన బాలయ్య
balayya-1
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Nov 16, 2020 | 5:06 PM

Balayya Corona Vaccine: ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ వ్యాక్సిన్ వస్తేనే మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి నేపథ్యంలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ రాకపోవచ్చునని ఆయన అన్నారు.సెహరి మూవీ ఫస్ట్ లుక్ లాంచ్‌లో పాల్గొన్న బాలయ్య.. కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. (బాలయ్య-నాగశౌర్య మల్టీస్టారర్‌.. కాంబోను సెట్ చేసిన ప్రముఖ నిర్మాత..!)

”కరోనా మనతోనే ఉంటుంది. దాంతో మనం సహజీవనం చేయాల్సి వస్తుంది. వ్యాక్సిన్ గురించి వార్తలు వస్తున్నాయి. కానీ అది అంత సులభం కాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని బాలయ్య అన్నారు. కాగా కరోనా విజృంభణ ప్రారంభమైన సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ ఆ తరువాత ప్రధాని మోదీ, డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనామ్‌ సహా పలువురు ఇదే విషయాన్ని తెలిపారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో సహజీవనం తప్పదని వారు అన్నారు. ఇక ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న సమయంలో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. (ఇప్పుడు డెలివరీ బాయ్‌గా చేస్తున్నా.. నెదర్లాండ్‌ క్రికెటర్ పాల్‌ ఆవేదన )

తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..