పెళ్లయిన వారానికే విష ప్రయోగం.. ఏమైందంటే..!
పెళ్లి అయి వారం రోజులు కూడా గడవకముందే భర్తకు.. విషం ఇచ్చింది భార్య. వారి వైవాహిక బంధానికి ఏడు రోజుల్లోనే స్వస్తి పలికింది. కాళ్ల పారాణి ఆరకముందే భర్తను చంపే ప్రయత్నం చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన లింగమయ్యకి 10 రోజుల క్రితం.. మదనంతపురం గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం అయ్యింది. పెళ్లిలోని కొన్ని కార్యక్రమాల అనంతరం.. పెళ్లి కూతురు.. వాళ్ల ఇంటికి […]
పెళ్లి అయి వారం రోజులు కూడా గడవకముందే భర్తకు.. విషం ఇచ్చింది భార్య. వారి వైవాహిక బంధానికి ఏడు రోజుల్లోనే స్వస్తి పలికింది. కాళ్ల పారాణి ఆరకముందే భర్తను చంపే ప్రయత్నం చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన లింగమయ్యకి 10 రోజుల క్రితం.. మదనంతపురం గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం అయ్యింది. పెళ్లిలోని కొన్ని కార్యక్రమాల అనంతరం.. పెళ్లి కూతురు.. వాళ్ల ఇంటికి వెళ్లింది. ఆమెను చూడటానికి అత్తవారింటికి వచ్చిన లింగమయ్యకు పాలల్లో విషం కలిపి భార్య ఇవ్వడంతో.. అపస్మారక స్థితికి వెళ్లాడు. లింగమయ్యని.. గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి సోదరుడు తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. కేసును జొన్నగిరి పోలీస్ స్టేషన్‌కి.. గుత్తి పోలీసులు బదలాయించారు.