Murder: భార్యా భర్తల గొడవ.. బావను హత్య చేసిన బావమరిది..
Husband Murder in Krishna District: కృష్ణా జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. బావను.. బావమరిది అతి కిరాతకంగా హత్యచేశాడు. ఈ సంఘటన
Husband Murder in Krishna District: కృష్ణా జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. బావను.. బావమరిది అతి కిరాతకంగా హత్యచేశాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట తొర్రకుంటపాలెంలో జరిగింది. వివరాలు.. తొర్రకుంటపాలెం గ్రామానికి చెందిన తాటి సురేష్ (40) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్యామలను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సురేష్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కొంత కాలం నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్దలు పంచాయతీ పెట్టి రాజీ చేశారు. ఆతర్వాత కూడా ఈ నెల 19న దంపతులిద్దరి మధ్య ఘర్షణ జరగటంతో భార్య పుట్టింటికి వెళ్లింది. గురువారం అర్థరాత్రి సమయంలో సురేష్ భార్య కోసం వెళ్లాడు.
ఆ సమయంలో శ్యామల ఇంట్లో లేకపోవటంతో భార్య సోదరుడు గుడిశ కిషోర్‌కు సురేష్‌కు మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో కిషోర్ కత్తితో సురేష్‌పై దాడి చేశాడు. సురేష్ అక్కడికక్కడే కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు సురేష్‌ను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు ఆయన్ను వెంటనే విజయవాడకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మరణించాడు. నందిగామ డీఎస్పీ, జగ్గయ్యపేట పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి పరమేశ్వరరావు ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. కిషోర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: