AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

అల్లారుముద్దుగా చూసుకున్న మేనత్త బంగారంపై కన్నేసిన ఓ కంత్రిగాడు ఆమెను అతికిరాతకంగా హత్య చేశాడు. అచ్చం సినీ పక్కిలో పోలీసుల దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు. కథ అడ్డం తిరిగి ఖాకీలకు చిక్కాడు. టెక్నాలజీ ఆధారంగా మర్డర్ మిస్టరీని పోలీసులు చాకచక్యంగా చేదించి ఆ కేటుగాన్ని అరెస్ట్ చేశారు. హత్య అనంతరం దోసుకుపోయిన బంగారం అంతా కక్కించి అతన్ని కటకటల్లోకి పంపారు.

Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
G Peddeesh Kumar
| Edited By: Anand T|

Updated on: Jun 13, 2025 | 6:42 PM

Share

వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్తంభంపల్లి గ్రామంలో ఈనెల 7 తేదీన జరిగిన వృద్ధురాలి హత్య సంచలం సృష్టించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్వరూప అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇనుప డంబెల్స్‌తో ఆమె తలపై మోదీ అతికిరాతకంగా చంపారు. హత్య అనంతరం వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారంతో పాటు, ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలు నగదు మొత్తం లూటీ చేశారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ మర్డర్ మిస్టరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గీసుకొండ పోలీసులు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే నిందితున్ని పట్టుకున్నారు. టెక్నాలజీ ఆధారంగా నిందితుని గుర్తించి అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆ వృద్ధురాలిని హత్య చేసింది సొంత మేనల్లుడే అని గుర్తించిన పోలీసులు కంగుతిన్నారు. వరంగల్ లోని మట్వాడలో రాజీవ్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రణయ్ అనే వ్యక్తి ప్రయివేట్ ఉద్యోగం జీవనం సాగించేవాడు. జల్సాలకు అలవాటు పడిన సంజయ్ డబ్బుల కోసం మేనత్త బంగారంపై కన్నేశాడు. ఎలాగైన ఆమె వద్ద ఉన్న నగలను కాజేయాలని ప్లాన్ చేశాడు. హత్యకు ముందురోజు తన అత్త వద్దకు వచ్చిన ప్రణయ్ ప్లాన్ ప్రకారం అత్తతో ఆప్యాయంగా గడిపాడు. ఆ తర్వాత ఆమెను హత్యచేసి ఎవరో ప్రొఫెషనల్ దొంగలు హత్య చేసినట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. హత్య అనంతరం తన మేనత్త ఒంటి పై ఉన్న బంగారంతో పాటు, ఇంట్లోని బంగారం అంతా దోచుకొని పారిపోయాడు.

అయితే, ఎంతటి తెలివితేటలు ఉన్న వారైన ఎక్కడో ఒకచోట తప్పుచేసి దొరికిపోతారు. ఇక్కడ కూడా ఇదే జరిగింది. ఇలానే తాను చేసిన కొన్ని తప్పులతో పోలీసులకు దొరికి పోయాడు సంజయ్. నెట్వర్క్ ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు, గీసుకొండ CI మహేందర్, ఆయన టీమ్ చాకచక్యంగా నిందితుని పట్టుకున్నారు. మృతురాలి సొంత మేనల్లుడే హంతకుడని తేల్చారు. దీంతో అతని వద్ద నుంచి 17 తులాల బంగారం, వెండి, కొంత నగదు రికవరీ చేశారు. నిందితునిపై మర్డర్ కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించారు. నిందితున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..