AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్‌ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బ్లాక్‌ బాక్స్..! దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించాలంటే.. ఖచ్చితంగా డీకోడ్ కావాల్సింది కూడా ఈ బ్లాక్‌బాక్సే..! అసలేంటీ బ్లాక్‌ బాక్స్‌..? చూడ్డానికి బ్రైట్ ఆరెంజ్‌ కలర్‌లో ఉంటూ బాక్స్‌బాక్స్‌గా పిలవడే దీనికి, ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలు తెలియజేసే దమ్ముందా..?

తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్‌ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!
Flight Blackbox
Balaraju Goud
|

Updated on: Jun 13, 2025 | 6:51 PM

Share

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బ్లాక్‌ బాక్స్..! దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించాలంటే.. ఖచ్చితంగా డీకోడ్ కావాల్సింది కూడా ఈ బ్లాక్‌బాక్సే..! అసలేంటీ బ్లాక్‌ బాక్స్‌..? చూడ్డానికి బ్రైట్ ఆరెంజ్‌ కలర్‌లో ఉంటూ బాక్స్‌బాక్స్‌గా పిలవడే దీనికి, ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలు తెలియజేసే దమ్ముందా..?

ప్రతి కమర్షియల్ ప్లైట్‌లో రెండు బ్లాక్‌ బాక్సులుంటాయి. ఒకటి విమానానికి ముందు భాగంలో.. మరొకటి వెనుక భాగంలో ఉంటుంది. ఇక మొదటిది ప్లైట్ డేటా, విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, కాక్‌పిట్ వాయిస్, పైలట్ల సంభాషణలు, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. ఇక రెండో బ్లాక్ బాక్స్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో పైలట్ల కమ్యూనికేషన్, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. దీంతో ఈ రెండు బ్లాక్‌ బాక్సుల ద్వారా డేటాను విశ్లేషించి ప్రమాదానికి ముందు విమానంలో ఏమి జరిగిందో.. పైలట్లు ఏమి మాట్లాడారో.. ఏ వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు. ఇప్పుడదే పనిలో ఫుల్‌ బిజీగా ఉన్నారు దర్యాప్తు అధికారులు.

ఫ్లైట్ రికార్డర్, బ్లాక్ బాక్స్ 1950ల ప్రారంభంలో అభివృద్ధి చేయడం జరిగింది. బ్లాక్ బాక్స్‌ను ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త డేవిడ్ రోనాల్డ్ డి. మే వారెన్ కనుగొన్నారు పేలుళ్లు, అగ్ని, నీటి పీడనం, హై-స్పీడ్ క్రాష్‌లను తట్టుకునేలా రూపొందించడం జరిగింది. కాగా, అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన డాక్టర్ల హాస్టల్ పైకప్పుపై ఈ బ్లాక్ బాక్స్ కనుగొనట్లు సమాచారం. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది సహాయంతో, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం బ్లాక్ బాక్స్‌ను గుర్తించింది. విమాన ప్రమాద దర్యాప్తుల కోసం 2025 ఏప్రిల్‌లోనే భారత్‌లో బ్లాక్‌ బాక్స్‌ ల్యాబ్‌ ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇప్పుడా ల్యాబ్‌లోనే ఫస్ట్ బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించే ప్రక్రియ కొనసాగుతోంది.

బ్లాక్ బాక్స్ ప్రమాదానికి దారితీసిన సంఘటనలను పరిష్కరించడానికి పరిశోధకులకు సహాయపడుతుంది. కాక్‌పిట్, విమాన వ్యవస్థలలో ఏమి జరిగిందో ఇది అందరికీ చెబుతుంది. ఇది క్రిమినల్ కేసుల్లో DNA సాక్ష్యం వలె పనిచేస్తుంది. సంఘటన ఖచ్చితమైన, నిష్పాక్షికమైన సాక్ష్యాన్ని అందిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..