Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యానికి బానిసైన తండ్రి తరచూ తల్లిని అనుమానిస్తూ, వేధించడాన్ని చూసిన కొడుకు భరించలేక పోయాడు. తండ్రి వేధింపుల నుంచి తల్లికి విముక్తి కలిగించాలనుకున్నాడు. ఇంకేముంది కన్న తండ్రిని కత్తితో నరికి చంపి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
Tpt Murdered
Raju M P R
| Edited By: Anand T|

Updated on: Jun 13, 2025 | 9:39 PM

Share

మద్యాపాన వ్యసనం ఎన్నో జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది. మద్యానికి అలవాటైన వ్యక్తులు తమ పచ్చని కాపురాల్లో వారే నిప్పులు పోసుకుంటున్నారు. మద్యానికి బానిసై కొందరు కుటుంబాలను వదిలేస్తుంటే, మరికొందరు కట్టుకున్న భార్యలను అనుమానిస్తూ వాళ్లను వేధింపులకు గురిచేస్తున్నారు. తాగాజా ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. మద్యానికి బానిసైన తండ్రి తరచూ తాగి వచ్చి తల్లిని అనుమానిస్తూ, వేధించడాన్ని చూసి భరించలేక పోయయిన కొడుకు కన్న తండ్రిని హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చిత్తూరులోని సంతపేట లెనిన్ నగర్ కాలనీలో ఉంటున్న వెంకట్ రెడ్డికి భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. దాదాపు 50 ఏళ్లు పైగానే వయస్సున్న వెంకట రెడ్డి వృత్తి రీత్యా లారీ డ్రైవర్. వెంకట్ రెడ్డి భార్య సరస్వతి, మోహన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి ఇద్దరు కొడుకులు ఉండగా పెద్దకొడుకు మోహన్ రెడ్డి కూడా లారీ డ్రైవర్. రెండో కొడుకు సోమశేఖర్ రెడ్డి మెడికల్ షాప్ లో పనిచేస్తున్నాడు. లారీ డ్రైవర్ గా ఉంటూ మద్యానికి బానిసైన వెంకట్ రెడ్డి భార్యపై అనుమానంతో నిత్యం గొడవపడేవాడు. మద్యం మత్తులో తల్లిపై చిందులు వేస్తున్న తండ్రి వెంకట రెడ్డి తీరును వారిస్తూ వచ్చిన ఇద్దరు కొడుకులు గతంలో తండ్రిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వెంకట్ రెడ్డికి పోలీసులు అప్పట్లో కౌన్సిలింగ్ కూడా ఇచ్చి పంపారు.

అయినా తండ్రి వెంకట్ రెడ్డి తీరులో ఎలాంటి మార్పు రాలేదు, ఎప్పటిలాగానే నిత్యం తాగి వచ్చి తల్లి సరస్వతి చిత్రహింసలకు గురిచేస్తుండడాన్ని చూసి కొడుకులు భరించలేక పోయారు. మద్యం మత్తులో తండ్రి పైశాచికత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని భావించారు. అయితే రెండు రోజుల క్రితం ఫుల్లుగా తాగి వచ్చిన వెంకట్‌ రెడ్డి ఎప్పటి లాగానే కత్తి పట్టుకుని భార్య సరస్వతిని బెదిరించడం స్టార్ట్ చేశాడు. అది చూసిన చిన్న కొడుకు సోమశేఖర్ రెడ్డి సహనం కోల్పోయి తండ్రి వద్ద ఉన్న కత్తి లాగేసుకొని తండ్రి వెంకట రెడ్డి ముఖంపై కత్తితో నరికాడు. రక్తస్రావం అధికం కావడంతో వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

తండ్రి చనిపోవడంతో అదే కత్తిని తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సోమశేఖర్ రెడ్డి, తాను తండ్రిని హత్య చేశానని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడు సోమశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించిన తర్వాత సోమశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే
చిరు, మహేష్ బాబు కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!
చిరు, మహేష్ బాబు కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!
బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!
ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!
ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!
అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడానికి కారణం ఎంటి..?
అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడానికి కారణం ఎంటి..?
చెట్టు లేదా ముఖం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోండి..
చెట్టు లేదా ముఖం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోండి..
బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో స్ట్రీమింగ్
బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో స్ట్రీమింగ్