గర్ల్ ఫ్రెండ్స్ కోసం గలీజ్ దందా..! ఆ ముగ్గురు ఏం చేశారంటే..?

గర్ల్‌ ఫ్రెండ్స్‌ కోసం బాయ్‌ ఫ్రెండ్స్‌ ఏం చేయడానికైనా రెడీ అయిపోతారు. ఆ ప్రేమ అలాంటిది.. మరి. తాజాగా.. గర్ల్ ఫ్రెండ్స్‌‌ కోసం ఓ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ గలీజ్ దందాకు తెరలేపారు. ప్రియురాళ్లకు కాస్ట్‌లీ గిఫ్ట్స్‌ ఇవ్వడానికి.. మొత్తానికి వారు.. దొంగల అవతారం ఎత్తారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని శాస్త్రి నగర్‌కు చెందిన.. శశాంక్ అగర్వాల్ (32), అమర్‌ సింగ్ (29), విశాల్ (25) అనే ముగ్గురు యువకులు […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:33 pm, Sat, 26 October 19
గర్ల్ ఫ్రెండ్స్ కోసం గలీజ్ దందా..! ఆ ముగ్గురు ఏం చేశారంటే..?

గర్ల్‌ ఫ్రెండ్స్‌ కోసం బాయ్‌ ఫ్రెండ్స్‌ ఏం చేయడానికైనా రెడీ అయిపోతారు. ఆ ప్రేమ అలాంటిది.. మరి. తాజాగా.. గర్ల్ ఫ్రెండ్స్‌‌ కోసం ఓ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ గలీజ్ దందాకు తెరలేపారు. ప్రియురాళ్లకు కాస్ట్‌లీ గిఫ్ట్స్‌ ఇవ్వడానికి.. మొత్తానికి వారు.. దొంగల అవతారం ఎత్తారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని శాస్త్రి నగర్‌కు చెందిన.. శశాంక్ అగర్వాల్ (32), అమర్‌ సింగ్ (29), విశాల్ (25) అనే ముగ్గురు యువకులు ఫ్రెండ్స్. ఈ ముగ్గురు మరో ముగ్గురి అమ్మాయిలన ప్రేమిస్తున్నారు. వారి మెప్పుడు కోసం వీరు చోరీల బాట పట్టారు. మొదట వీరు డెలీవరీ బాయ్‌లుగా పనిచేసే వీరికి.. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా.. పలువురు విలువైన బహుమతులు బుక్ చేస్తారని తెలుసు. ఇది గమనించిన వీరు. అమేజాన్ నుంచి డెలీవరీ బాయ్‌ ప్రమోద్ కుమార్ డెలీవరీ ఇచ్చేందుకు పంజాబీబాగ్‌ ప్రాంతానికి వెళ్తుండగా.. అటకాయించి.. విలువైన వస్తువుల్ని తీసుకొని ఉడాయించారు.

ఆ బహుమతులను వారి ప్రియురాళ్లుకు ఇద్దామనుకునేలోపు.. శశాంక్, అగర్వాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో దొంగ విశాల్ పరారీలో ఉన్నాడు. ఆ దొంగను కూడా త్వరలోనే పట్టుకుని.. కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశ పెడతామని.. ఢిల్లీ డీసీపీ పేర్కొన్నారు.