AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరుగురు కుటుంబసభ్యులను అతి కిరాతకంగా హత్య చేసిన కేసు.. కోర్టు సంచలన తీర్పు!

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జుత్తాడ సామూహిక హత్యల కేసులో విశాఖపట్నం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2021 ఏప్రిల్ 15వ తేదీన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపిన కేసులో నిందితుడైన బత్తిన అప్పలరాజును దోషిగా తేల్చిన కోర్టు, నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఆరుగురు కుటుంబసభ్యులను అతి కిరాతకంగా హత్య చేసిన కేసు.. కోర్టు సంచలన తీర్పు!
Anand T
|

Updated on: Jun 27, 2025 | 9:57 PM

Share

విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో విశాఖ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2021 ఏప్రిల్ 15వ తేదీన పెందుర్తి పీఎస్ పరిధిలో జుత్తాడలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి కుటుంబ సభ్యులను అత్యతంత కిరాతకంగా వెంటాడి మరీ హత్య చేశాడు. ఒళ్లు గగుర్లు పుట్టించేలా కనిపించిన ఈ హత్యా దృశ్యాలు,ఈ ఘటన అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు అన్ని సాక్ష్యాలు సమర్పించడంతో ఈ కేసులో అప్పలరాజును దోషిగా తేల్చిన కోర్టు అతనికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఈ హత్యలు ఎప్పుడు, ఎందుకు జరిగాయి..

2021 ఏప్రిల్ 15న పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. అయితే ఇదే గ్రామానికి చెందిన బత్తిన , బొమ్మిడి కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాధాలు ఉన్నాయి. మొదట తన కుమార్తెను బమ్మిడి రమణ కొడుకు విజయ్‌ లవ్‌ చేశాడని..అప్పలరాజు రమణ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా తన కూతురికి మత్తు పదార్థాలు ఇచ్చి తను వేధించాడని ఆరోపించాడు. కేసు విచారణ సమయంలో.. తన కుమార్తె జీవితం నాశనం కావడానికి, అందుకు బమ్మిడి రమణ కుటుంబమే కారణమని పగపెంచుకున్న అప్పల రాజు.. వాళ్లపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొని.. ఏప్రిల్‌ 15న బమ్మిడి రమణ ఇంటికి వెళ్లి వాళ్ల ఇంట్లోని కుటుంబ సభ్యులను అతికిరాతకంగా కత్తితో నరికి చంపినట్టు పోలీసులు తెలిపారు.

ఈ హత్యల తర్వాత నిందితుడు అప్పలరాజు కత్తి పట్టుకొని నేరుగా పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారమే అప్పలరాజు ఈ హత్యలు చేసినట్టు నిర్ధారించి, సాక్షాధారాలతో అతన్ని కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన న్యాయ స్థానం అప్పలరాజును దోషిగా తేలుస్తూ.. అతనికి మరణశిక్ష విధించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..