AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triple Murder: ప్రతిజ్ఞ చేసి మరీ భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భార్య.. ఎక్కడో తెలుసా?

కర్ణాటక రాష్ట్రం కాలబురగిలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ ప్రతిజ్ఞ చేసి మరీ తన భర్త హత్యకు కారణమైన ముగ్గురు నిందితులను హతమార్చింది. గతేడాది సదురు మహిళ భర్తను హత్య చేసిన ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. వారు ఇటీవలే విడుదలయ్యారు. అయితే వారు ఎప్పుడెప్పుడు బయటకొస్తారా అని వేచి ఉన్న మృతుడి భార్య ఈ నెల 24న కొందరి వ్యక్తులతో కలిసి ఆ ముగ్గురిని హత్య చేసింది. అయితే వీరిన హత్య చేసే వరకు తన మంగళసూత్రాన్ని తీసివేయనని సదురు మహిళ భర్త మృతదేహం ముందు ప్రతిజ్ఞ చేసింది. తాజాగా దాన్ని నెరవేర్చుకుంది.

Triple Murder: ప్రతిజ్ఞ చేసి మరీ భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకున్న భార్య.. ఎక్కడో తెలుసా?
Karnataka Crime
Anand T
|

Updated on: Jun 27, 2025 | 11:04 PM

Share

కర్ణాటక రాష్ట్రం కలబురగిలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ ప్రతిజ్ఞ చేసి మరీ తన భర్త హత్యకు కారణమైన ముగ్గురు నిందితులను హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది నవంబర్ 12న నిందితుల్లో నిందితురాలైన భాగ్యశ్రీ భర్త సోమనాథ్‌ను..తాజాగా హత్యకు గురైన సిద్ధారుధ, అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. అయితే కళ్లముందే తన భర్తను హత్య చేయడంతో కుమిలిపోయిన సోమనాథ్ భార్య అతని మృతదేహం ముందే ఓ ప్రతిజ్ఞ చేసింది. తన భర్త హత్యకు కారణమైన వారిని భూమ్మీద లేకుండా చేసేవరకు తన మంగళసూత్రాన్ని తీసివేయనని ఆమె ప్రమాణం చేసింది.

అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమ్‌నాథ్‌ను హత్యచేసిన నిందితులు సిద్ధారుధ, జగదీష్, అన్నప్పను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ ముగ్గురు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సోమ్‌నాథ్‌ భార్య, ఆమె కుటుంబ సభ్యులు వాళ్లను లేపేయడానికి స్కెచ్‌ వేశారు. సిద్ధారుధ, జగదీష్, అన్నప్పలు పట్టణ్‌ సమీపంలోని ఓ ధాబాలో ఉన్నట్టు తెలుసుకొని ఈ నెల 24 రోజు రాత్రి వారిపై దాడి చేసి హత్య చేశారు. అయితే దాడి చేసే సమయంలో అన్నప్ప, అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా..వాళ్లను వెంటాడని భాగ్యశ్రీ గ్యాంగ్‌ అందులో ఒకరిని చంపేసింది. అయితే చీకట్లో సరిగ్గా కనిపించక వాళ్లు అన్నప్పకు బదులు మరో వ్యక్తిని హత్య చేశారు.

ఈ హత్యల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాత కక్షల కారణంగా ఈ హత్యలు జరిగినట్టు నిర్ధారించారు. తాగాజా ఈ కేసుకు సంబంధించి మొత్తం పది మందిని అరెస్ట్ చేశారు. నిందితులు పట్టాణ్ గ్రామానికి చెందిన భాగ్యశ్రీ (22), నాగరాజ్ (17), పిరేష్ (35), నాగరాజ (23), ఇరన్న (27), భిర్ణ్య (21), సిద్ధినాద సాగర్ (24), రచన్న్య అలియాస్ గిల్లి (22), చంద్రకాంత్ (30), భాగ్యశ్రీగా పోలీసులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..