AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Variety Theft: పిల్లులు పట్టేవాళ్లమంటూ వచ్చారు.. ఇళ్లంతా దోచుకుని వెళ్లిపోయారు.. తస్మాత్ జాగ్రత్త

దొంగలు రోజురోజుకు అప్‌డేట్ అవుతున్నారు. వెరైటీ ఐడీయాలతో పోలీసులకుసరికొత్త సవాళ్లు విసురుతున్నారు. తాజాగా  పిల్లులు పడతాం అంటూ ఇంట్లోకి వచ్చి కొత్త రీతిలో

Variety Theft: పిల్లులు పట్టేవాళ్లమంటూ వచ్చారు.. ఇళ్లంతా దోచుకుని వెళ్లిపోయారు.. తస్మాత్ జాగ్రత్త
Ram Naramaneni
|

Updated on: Feb 04, 2021 | 2:08 PM

Share

Variety Theft: దొంగలు రోజురోజుకు అప్‌డేట్ అవుతున్నారు. వెరైటీ ఐడీయాలతో పోలీసులకుసరికొత్త సవాళ్లు విసురుతున్నారు. తాజాగా  పిల్లులు పడతాం అంటూ ఇంట్లోకి వచ్చి కొత్త రీతిలో దొంగతనానికి పాల్పడింది ఓ ముఠా. పట్టపగలు గ్రామంలో అందరూ చూస్తుండగానే పిల్లులు పట్టేవాళ్లలా వలలు చూపిస్తూ ఇంటివారిని నమ్మించి సుమారు 8 తులాల బంగారం, వెండి పట్టీలు, నగదు ఎత్తుకెళ్లిపోయారు గుర్తుతెలియని వ్యక్తులు.

చిత్తూరు జిల్లా పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఈ వెరైటీ లూటీ జరిగింది. ఐదు వాహనాల్లో వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు..మాయమాటలు చెప్పి ఓ ఇళ్లు గుళ్ల చేశారు. మీ ఇంట్లో నల్లపిల్లి దూరిందని..దానిని పట్టుకుంటామని చెప్పి ఆ ముఠా వచ్చిన పని కానిచ్చేసింది. దొంగల ముఠాలోని ఓ మహిళ పిల్లిని పట్టుకొస్తానని చెప్పి ఇంట్లో చొరబడింది. మరోమహిళ ఇంటివారిని మాటల్లో పెట్టింది. బయట హంగామా చేస్తూ..ఇంట్లోకి వెళ్లిన మహిళ..బీరువాలోని బంగారం, వెండి, నగదు సర్దేసింది. నెమ్మదిగా బయటకు వచ్చి నా పనైపోయిందని వెళ్లిపోయింది. దీంతో మిగిలిన వారు కూడా వెళ్లిపోయారు. తీరా ఆ సాయంత్రానికి బీరువా చూసి దొంగతనం జరిగిందని తెలుసుకున్న ఇంట్లోనివాళ్లు.. కంగుతిన్నారు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Also Read:

Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?

Chris Gayle: సప్త సముద్రాలు ఈదినవాడికి పిల్లకాలవే ఎదురొస్తే..? క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్…

Viral Photo: పిచ్చికి పరాకాష్టా..?.. లేక ఫోటోషాపా.. వైరల్ ఫోటోపై నెటిజన్ల రియాక్షన్

చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!