Chris Gayle: సప్త సముద్రాలు ఈదినవాడికి పిల్లకాలవే ఎదురొస్తే..? క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్…
యూనివర్స్ బాస్ అని పిలువబడే క్రిస్ గేల్ మరోసారి దుమ్మురేపాడు. తన బ్యాట్ పవరేంటో చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
Chris Gayle: యూనివర్స్ బాస్ అని పిలువబడే క్రిస్ గేల్ మరోసారి దుమ్మురేపాడు. తన బ్యాట్ పవరేంటో చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బుధవారం అబుదాబిలో జరిగిన టి 10 లీగ్‌లో అతడు క్రికెట్ ప్రేమికులను అలరించాడు. టీం అబుదాబి తరఫున ఆడుతున్న అతను కేవలం 22 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ తన ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. అంటే అతడు 15 బంతుల్లో బౌండరీల రూపంలో 78 పరుగులు చేశాడు. గేల్ భీకర ఇన్నింగ్స్ నేపథ్యంలో అబుదాబి… మరాఠా అరేబియా నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం ఐదున్నర ఓవర్లలో పూర్తి చేసింది. ఇప్పటివరకు అబుదాబి టి 10 లీగ్‌లో గేల్ తన స్థాయి ప్రదర్శన చేయలేదు. కానీ బధవారం మాత్రం మోత మోగించాడు. మరాఠా అరేబియా వారి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 97 పరుగులు చేసింది.
కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీకి చేరుకున్నాడు గేల్. ఇది టి 10 లీగ్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ. గేల్‌కు ముందు, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మహ్మద్ షెహజాద్ కూడా 2018 లో 12 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో అబుదాబి 10 లీగ్‌లో గేల్ సాధించిన అత్యధిక స్కోరు 9. అతను ఒక్కసారి కూడా రెండంకెలు దాటలేకపోయాడు. అయితే, అతను ఇప్పుడు ఒకే ఇన్నింగ్స్‌లో తన మార్క్ ఏంటో చూపించాడు.
Also Read:
Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?