AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

England Cricketers: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన ఇంగ్లండ్ మాజీ ప్లేయర్లు.. ఆ నిర్ణయమే వీరి ఆగ్రహానికి కారణం..

England Cricketers: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై ఇంగ్లండ్ మాజీ క్రికెట్లరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ

England Cricketers: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన ఇంగ్లండ్ మాజీ ప్లేయర్లు.. ఆ నిర్ణయమే వీరి ఆగ్రహానికి కారణం..
Shiva Prajapati
|

Updated on: Feb 04, 2021 | 12:58 AM

Share

England Cricketers: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై ఇంగ్లండ్ మాజీ క్రికెట్లరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. త్వరలో దక్షిణాఫ్రికా వేదికగా ఆస్ట్రేలియాతో క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, కరోనాను బూచీగా చూపిస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు దక్షిణాఫ్రికా టూర్‌ను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రత నేపథ్యంలో ఈ టూర్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని తెలిపింది. అయితే ఈ ప్రకటనే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

ఈ వ్యవహారంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇండియాతో ఇలా వ్యవహరించగలదా? అంటూ నిలదీశాడు. ఈ నిర్ణయం ప్రపంచ క్రికెట్‌కు చీకటి రోజుగా అభివర్ణించాడు. ‘ఇంగ్లండ్ కూడా కరోనాను సాకుగా చూపి దక్షిణాఫ్రికాతో టూర్‌ను క్యాన్సిల్ చేసుకుంది. అదే సమయంలో ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చినా శ్రీలంక టూర్‌ను మాత్రం కొనసాగిస్తోంది’ అంటూ ఘాటుగా స్పందించాడు పీటర్సన్.

కరోనా మహమ్మారి సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశాలకు అండగా ఉండాల్సిపోయి.. ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారా? అంటూ మరో మాజీ ప్లేయర్ మైకేల్ వాన్ తీవ్రంగా స్పందించాడు. ఆయా దేశాలకు క్రికెట్ బోర్డులకు ఆర్థిక సమస్యలు తలెత్తకుండా టీమిండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డులు అండగా నిలవాలని వాన్ కోరాడు.

Kevin Pietersen Tweet:

Also read:

MLA Challenge: అది నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తా.. విమర్శకులకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..

యావత్ దేశానికే ఆదర్శప్రాయం: బాలికలలో విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాల వంటి రుగ్మతలపై పోరాడటానికి పరుగులు