AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Challenge: అది నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తా.. విమర్శకులకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..

MLA Challenge: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్‌గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి అల్లుడికి ఫోన్ బెదిరించారని వస్తున్న..

MLA Challenge: అది నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తా.. విమర్శకులకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..
Shiva Prajapati
|

Updated on: Feb 04, 2021 | 12:23 AM

Share

MLA Challenge: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్‌గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి అల్లుడికి ఫోన్ బెదిరించారని వస్తున్న వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు స్పందించారు. తన ప్రతిష్ట దెబ్బతీయడానికే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. గతంలో మాట్లాడిన మాటలను ఇప్పుడు తెరమీదకు వచ్చారని ఆరోపించారు. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని ఆయన కొట్టిపారేశారు. ఎన్నిక ఏకగ్రీవమైతే గ్రామం అభివృద్ధి చెందుతుందని మాత్రమే సదరు అభ్యర్థికి సూచించానని ఎమ్మెల్యే కన్నబాబు చెప్పుకొచ్చారు. కానీ, తాజా మాటలకు, నాటి మాటలను జత చేసి తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే తక్షణమే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కన్నబాబు సవాల్ విసిరారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు టీడీపీ, బీజేపీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు.. ఓ అభ్యర్థి అల్లుడికి ఫోన్ చేసి బెదిరించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దానికి సంబంధించిన ఆడియో కూడా బయటకు రావడం సంచలనం రేకెత్తిస్తోంది. ‘ఎన్నికల్లో పోటీ చేస్తే కంప్లయింట్ ఇప్పించి డిస్‌క్వాలిఫై చేయిస్తాను, ఆ తరువాత మీరే ఇబ్బందులు పడుతారు’ అంటూ అభ్యర్థి బంధువుకు కన్నబాబు రాజు వార్నింగ్ ఇచ్చినట్లు సదరు ఆడియోలో ఉంది. ఈ ఆడియో టేపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను కుదిపేస్తోంది.

Also read:

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం.. తాజాగా సంచలనం రేపుతున్న ఓ ఎమ్మెల్యే ఆడియో రికార్డు

Sasikala Returns : తమిళనాడులో చిన్నమ్మ ప్రకంపనలు.. రోజు రోజుకు సీరియస్‌గా మారుతున్న పొలిటికల్ సీన్..