AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sasikala Returns : తమిళనాడులో చిన్నమ్మ ప్రకంపనలు.. రోజు రోజుకు సీరియస్‌గా మారుతున్న పొలిటికల్ సీన్..

తమిళనాడులో చిన్నమ్మ ప్రకంపనలు మొదలయ్యాయి. జైలుకెళ్లేముందుకే అమ్మ సమాధి సాక్షిగా శపథం చేసిన జయ సహచరి..తన పంతం నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఏఐఏడీంకే నుంచి నాయకుల్ని లాగడం కాదు...ఏకంగా..

Sasikala Returns : తమిళనాడులో చిన్నమ్మ ప్రకంపనలు.. రోజు రోజుకు సీరియస్‌గా మారుతున్న పొలిటికల్ సీన్..
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 9:33 PM

Share

Sasikala Returns : తమిళనాడులో చిన్నమ్మ ప్రకంపనలు మొదలయ్యాయి. జైలుకెళ్లేముందుకే అమ్మ సమాధి సాక్షిగా శపథం చేసిన జయ సహచరి..తన పంతం నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఏఐఏడీంకే నుంచి నాయకుల్ని లాగడం కాదు…ఏకంగా ఆ పార్టీనే హస్తగతం చేసుకోవాలనే ప్లాన్‌తో కదులుతున్నారు. శశికళ బెంగళూరు ఆస్పత్రి మెట్లు దిగుతుండగానే…తమిళనాట అన్నాడీంకేలో షేకింగ్‌ మొదలైంది.

అమ్మపార్టీ నేతలెందరో..ఇప్పటికే చిన్నమ్మతో టచ్‌లో ఉన్నారు. దీంతో పళని-పన్నీర్‌ ద్వయం గుండెల్లో గుబులు మొదలైంది. చిన్నమ్మ రీఎంట్రీ తర్వాత పరిణామాలెలా ఉంటాయోనని టెన్షన్‌ పడుతుండగానే…రెండాకుల గుర్తు తనకే చెందాలంటూ సుప్రీంని ఆశ్రయించారు శశికళ.

అమ్మ మరణం తర్వాత తనదనుకున్న పార్టీనే.. తనను దూరం పెట్టటంతో తడాఖా చూపాలనుకుంటున్నారు శశికళ. అన్నాడీఎంకే పార్టీని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. చిన్నమ్మ తలుచుకోవడమే ఆలస్యం.. అన్నాడీఎంకేకి శశికళ సారధ్యం వహించాలని రాష్ట్రమంతా పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. అమ్మ మరణం తర్వాత చిన్నమ్మ జైలు పాలుకావటంతో అనివార్యంగా సర్దుకుపోతున్న నేతలు…టైం చూసుకుని గోడెక్కేశారు.

ఇప్పటికే పరోక్షంగా శశికళకు మద్దతు పలుకుతున్న అన్నాడీఎంకే నేతలు.. ప్లేట్‌ ఫిరాయించేందుకు రెడీ అయ్యారు. చిన్నమ్మకు మద్దతుగా పోస్టర్ల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం కౌంటర్‌ అటాక్‌కి రెడీ అయ్యారు. ఆలస్యం చేస్తే అసలుకే మోసమొచ్చేలా ఉండటంతో… తూత్తుకుడి, విల్లుపురం, తేని, తిరునల్వేలి, మధురై సహా పలు జిల్లాల్లో శశికళకి మద్దతు పలుకుతున్నవారిపై వేటేశారు.

చిన్నమ్మ మళ్లీ జయసమాధి దగ్గరికి వెళ్లకుండా అధికారపార్టీ పెద్దలు జాగ్రత్త పడుతున్నారు. ఏంచేసినా…చిన్నమ్మ దెబ్బకి అన్నాడీఎంకే నిలువునా చీలిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు.. దేశంలో ఒక్కో రాష్ట్రాన్నీ తన ఖాతాలో వేసుకుంటున్న బీజేపీ.. తమిళనాడు ఎన్నికలపై దృష్టిపెట్టింది. అన్నాడీఎంకేతో కలిసి తమిళనాట పాగా వేయాలనే వ్యూహంతో ఉంది కమలం పార్టీ.

ఇందులో భాగంగా తమిళనాడు ఎన్నికల ఇంచార్జిగా.. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించింది. అయితే బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు చిన్నమ్మ. ఈ నెల 7న చెన్నైకి రానున్న చిన్నమ్మకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లుచేస్తోంది శశికళ వర్గం. హోసూర్‌ నుంచి చెన్నై వరకు పెద్దఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నమ్మ రీ ఎంట్రీతో తమిళనాడు రాజకీయం కొత్త టర్నింగ్‌ తీసుకోబోతోంది.

అయితే శశికళ అభిమానులు కోరుకుంటున్నట్టు రాజకీయాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషించవచ్చు కానీ, ఎన్నికల్లో పోటీకి ఇప్పట్లో అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకపోవటంతో.. అనర్హత వేటు నుంచి తప్పించుకునే మార్గాన్ని చిన్నమ్మ అన్వేషిస్తున్నారు. రిలీజ్‌ తర్వాత కారుపై అమ్మపార్టీ జెండాతోనే తన పొలిటికల్‌ ఎజెండా ఏంటో చెప్పేశారు చిన్నమ్మ. ఆమె చెన్నైకొచ్చాక తమిళనాడు రాజకీయం మరింత హాట్‌ హాట్‌గా మారిపోయి.