AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ శాంతి పలుకులు… భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదన్న పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బాజ్వా…

త‌మ‌ది శాంతికాముక దేశ‌మ‌ని, తాము భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ ఖ‌మ‌ర్‌ జావేద్ బాజ్వా ప్రక‌టించారు...

పాక్ శాంతి పలుకులు... భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదన్న పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బాజ్వా...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 03, 2021 | 6:23 PM

Share

త‌మ‌ది శాంతికాముక దేశ‌మ‌ని, తాము భారత్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ ఖ‌మ‌ర్‌ జావేద్ బాజ్వా ప్రక‌టించారు. ఇరుదేశాలూ శాంతియుతంగా కలిసి సాగాలన్నదే తమ అభిమతమని అన్నారు. పాకిస్థాన్‌ వైమానిక దళానికి సంబంధించి రావల్పిండిలో జ‌రిగిన‌‌ కార్యక్రమంలో ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. సమయం దొరికినప్పుడల్లా భారత్‌లో విధ్వంసాన్ని సృష్టించేందుకు చేసే పాక్ ఈ మాటలు మాట్లాడడంతో అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యపోయింది. ఇంకా పాక్ చీఫ్ ఏమన్నారంటే..

అన్ని దేశాలకు శాంతి హస్తాన్ని అందించాల్సిన సమయం…

ప్రపంచంలోని అన్ని దేశాలకూ శాంతిహస్తాన్ని అందించాల్సిన సందర్భం ఆసన్నమైన‌ద‌ని జావేద్ బ‌జ్వా వ్యాఖ్యానించారు. అయితే దీన్ని ఎవ‌రూ పాకిస్థాన్‌ బలహీనతగా భావించవద్దని తెలిపారు. త‌న‌ ప్రకటనకు పెడార్థాలు తీయవద్దని కోరారు. ఏ దేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కేవలం అభివృద్ధిని కోరుకుంటున్నాయ‌ని, క‌శ్మీర్ అంశాన్ని ఇరుదేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని సూచించారు. జమ్ముకశ్మీర్ ప్రజల అభీష్టం మేరకు కశ్మీర్ సమస్యను రెండు దేశాలూ సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. క‌య్యాల‌కు కాలు దువ్వడం కంటే పరస్పర గౌరవానికే తాము అత్యధిక ప్రాధాన్యమిస్తామ‌ని పాక్ ఆర్మీ చీఫ్ బ‌జ్వా అన్నారు.

Also Read: 

CAA: సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ నిబంధనలు రెడీ అవుతున్నాయి… కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ప్రకటన…

Kevin Pietersen: భారత్‌పై ఇంగ్లాండ్ ఆటగాడి ప్రశంసలు… సహృదయత కలిగిన వారు భారతీయులని కితాబు…

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో ‘మాస్‌ కాపీయింగ్‌'.. 47 మంది సస్పెండ్
ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో ‘మాస్‌ కాపీయింగ్‌'.. 47 మంది సస్పెండ్
ఐసీసీ రూల్స్ బుక్కును తగలేశారా?..పాక్ గెలుపు వెనుక అంపైర్ల కుట్ర
ఐసీసీ రూల్స్ బుక్కును తగలేశారా?..పాక్ గెలుపు వెనుక అంపైర్ల కుట్ర
పరుగెడుతున్న పాముకు చుక్కలు చూపించిన చిన్న పిల్లాడు..!
పరుగెడుతున్న పాముకు చుక్కలు చూపించిన చిన్న పిల్లాడు..!
మహాశివరాత్రి నుంచి ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
మహాశివరాత్రి నుంచి ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే
CBSE, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లలో 2026 ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు
CBSE, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లలో 2026 ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు
మలేషియా బయలుదేరిన ప్రధాని మోదీ..!
మలేషియా బయలుదేరిన ప్రధాని మోదీ..!