AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యావత్ దేశానికే ఆదర్శప్రాయం: బాలికలలో విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాల వంటి రుగ్మతలపై పోరాడటానికి పరుగులు

బాలికలలో విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా, బాల్య వివాహాలు వంటి సామాజిక చెడులపై పోరాడటానికి స్పూర్తిదాయకంగా బీహార్ సర్కారు పరుగులు పెడుతోంది...

యావత్ దేశానికే ఆదర్శప్రాయం: బాలికలలో విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాల వంటి రుగ్మతలపై పోరాడటానికి పరుగులు
Venkata Narayana
|

Updated on: Feb 04, 2021 | 2:38 AM

Share

బాలికలలో విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా, బాల్య వివాహాలు వంటి సామాజిక చెడులపై పోరాడటానికి స్పూర్తిదాయకంగా బీహార్ సర్కారు పరుగులు పెడుతోంది. ఈ విషయంలో యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచేట్టుగా ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో భాగంగా విద్యనభ్యసిస్తోన్న బాలికలకు ఇచ్చే స్కాలర్‌షిప్స్ ను “ముఖ్యమంత్రి కన్యా ఉత్తన్ యోజన బీహార్” పేరిట నవీకరించింది. ఈ పథకం కింద చిన్నారులకు ఇచ్చే ఉపకారవేతనాన్ని అనూహ్యంగా పెంచింది.

ఇంటర్మీడియట్ అర్హత ఉన్న పెళ్లికాని బాలికలకు, డిగ్రీ ఉన్న యువతులకు ఇస్తున్న స్కాలర్‌షిప్ మొత్తాన్ని వరుసగా రూ .25 వేలు, రూ .50 వేలకు పెంచింది బీహార్ ప్రభుత్వం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమంత్రి కన్యా ఉత్తన్ యోజన కింద తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని బీహార్ రాష్ట్ర విద్యా శాఖ నిర్వహిస్తుంది. అయితే, 12 వ తరగతి(ఇంటర్) పరీక్షలను క్లియర్ చేసిన(పాస్ అయిన) పెళ్లికాని బాలికలు మాత్రమే రూ .25 వేల స్కాలర్‌షిప్ ప్రయోజనం పొందటానికి అర్హులు.

ఇక, గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ విషయంలో, మహిళా విద్యార్థులకు వారి వైవాహిక స్థితితో సంబంధం లేకుండా స్కాలర్‌షిప్‌ పొందడానికి అర్హులు. సదరు డిగ్రీ చదువుకున్న విద్యార్థినికి పెళ్లి అయినప్పటికీ స్కాలర్ షిప్ ఇస్తారన్నమాట. అంతేకాదు, కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేశారు. దీంతో ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఆడపిల్లలున్నాకాని ఇద్దరు మాత్రమే ఈ ఉపకారవేతనాలను పొందగలరు.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సంబంధించి బీహార్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం వివిధ దశలున్నాయి.

మొదటి దశ : విద్యార్థుల మార్కుల జాబితా, లేదా డిగ్రీ పట్టా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, విద్యార్థి మొత్తం పొందిన మార్కులు అందించడం ద్వారా విద్యార్థి సదరు సైట్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

2వ దశ : స్కాలర్ షిప్ సొమ్ములు చెల్లించేందుకు వీలుగా సదరు విద్యార్థి బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి ఇందులో 1. విద్యార్థిని బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ బ్రాంచ్ యొక్క IFS కోడ్, విద్యార్థిని ఆధార్ సంఖ్య, బాలిక మొబైల్ నంబర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.

3వ దశ : అన్ని కాలమ్స్ పూర్తి చేసిన పిదప దరఖాస్తును ఖరారు చేసి సబ్మిట్ చేయాలి. ఇలా, ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా ఉపకారవేతానన్ని పొందేందుకు సదరు అభ్యర్థినికి అవకాశం లభిస్తుంది.

ఇఫ్లూ సహా వివిధ యూనివర్శిటీల అడ్మిషన్లు, నియమాకాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం: ఢిల్లీలో దాసోజు శ్రవణ్ ధ్వజం

మర్డర్ మిస్టరీ : కర్నాటక మాజీ సీఎం ధరమ్‌సింగ్‌ సోదరుడు దేవేందర్‌ సింగ్‌ కుమారుడు సిద్ధార్థ్‌ మర్డర్‌ కేసులో కొత్త ట్విస్టులు