AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇఫ్లూ సహా వివిధ యూనివర్శిటీల అడ్మిషన్లు, నియమాకాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం: ఢిల్లీలో దాసోజు శ్రవణ్ ధ్వజం

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో అడ్మిషన్లు, ఉద్యోగ నిమయాకల్లో వెనుకబడ్డ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని..

ఇఫ్లూ సహా వివిధ యూనివర్శిటీల అడ్మిషన్లు, నియమాకాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం: ఢిల్లీలో దాసోజు శ్రవణ్ ధ్వజం
Venkata Narayana
|

Updated on: Feb 03, 2021 | 10:52 PM

Share

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో అడ్మిషన్లు, ఉద్యోగ నిమయాకల్లో వెనుకబడ్డ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, ఇఫ్లూ సహా దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలో బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. రాజ్యాంగబద్ధంగా వెనుకబడిన వర్గాలకు దక్కాల్సిన 27 శాతం రిజర్వేషన్లు దక్కడం లేదని, ఇఫ్లూలో కుట్రపూరితంగా బీసీలకు అధ్యాపక పోస్టులు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు.

ఈ అంశంపై జాతీయ బీసీ కమిషన్‌కు గతంలోనే ఫిర్యాదు చేయగా, జనవరి 25న బీసీ కమిషన్ విచారణ చేపట్టిందని తెలిపారు. ఆనాటి విచారణకు హాజరైన ఇఫ్లూ అధికారులు నియామక ప్రక్రియ కోసం ఇచ్చిన నోటిఫికేషన్, ఇంటర్వ్యూలు రద్దు చేసి పూర్తి వివరాలతో ఫిబ్రవరి 2న హాజరుకావాల్సి ఉందని, అయితే ఇఫ్లూ వైస్ ఛాన్సలర్ సురేశ్ కుమార్ బేషజాలకుపోయి హాజరుకాకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇఫ్లూలోని 236 పోస్టుల్లో 27 శాతం, అంటే 63 ఉద్యోగాలు బీసీలకు కేటాయించాల్సి ఉండగా, 23 పోస్టులు మాత్రమే బీసీలకు కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారని శ్రవణ్ మండిపడ్డారు. కేవలం అధ్యాపక పోస్టుల నియామకాల్లోనే కాదు, పీహెచ్డీ అడ్మిషన్లలోనూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. అడ్మిషన్లైనా, నియామకాలైనా యూజీసీ నిబంధనల ప్రకారం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చేపట్టాలని హితవు పలికారు. యూనివర్సిటీలు తమ సొంత జాగీర్లు కాదని ఆయన అన్నారు.

Also read :

20 ఏళ్లుగా జరుగుతున్న పైశాచికం, నయా నిజాం వికృత చేష్టలు వెలుగులోకి. ఇంతకీ ఎవరీ నవాబు..? ఏంటాచేష్టలు..?

మర్డర్ మిస్టరీ : కర్నాటక మాజీ సీఎం ధరమ్‌సింగ్‌ సోదరుడు దేవేందర్‌ సింగ్‌ కుమారుడు సిద్ధార్థ్‌ మర్డర్‌ కేసులో కొత్త ట్విస్టులు

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్