మర్డర్ మిస్టరీ : కర్నాటక మాజీ సీఎం ధరమ్‌సింగ్ సోదరుడు దేవేందర్ సింగ్ కుమారుడు సిద్ధార్థ్ మర్డర్ కేసులో కొత్త ట్విస్టులు
కర్నాటక మాజీ సీఎం ధరమ్‌సింగ్ సోదరుడి దేవేందర్ సింగ్ కుమారుడు సిద్ధార్థ్ మర్డర్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఆస్తితగదాల కుటుంబ క్రైమ్ కథా చిత్రమా? ముగ్గురు మిత్రుల..
కర్నాటక మాజీ సీఎం ధరమ్‌సింగ్ సోదరుడు దేవేందర్ సింగ్ కుమారుడు సిద్ధార్థ్ మర్డర్ కేసులో కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఆస్తితగదాల కుటుంబ క్రైమ్ కథా చిత్రమా? ముగ్గురు మిత్రుల అమ్మాయి వివాదమా?.. సిద్ధార్థ్ హత్య కేసులో ఇవే ఇప్పుడు ప్రధాన అనుమానాలు కలుగుతున్నాయి. సిద్ధార్ధను హత్య చేసిన తర్వాత నెల్లూరు రాపూరు అడవుల్లో పాతి పెట్టారు. ఈ మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు అండర్ గ్రౌండ్‌కు వెళ్లారు. అటు తర్వాత జనవరి 29న శ్యామ్ సూసైడ్ చేసుకోగా.. వినోద్ రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు ఎవరి వల్ల జరిగాయన్నదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. అటు ఊపిరాడకుండా గొంతు బిగించడం వల్లే సిద్ధార్థ్ చనిపోయాడని పోస్టమార్టమ్‌లో తేలింది. ప్రాణాలు కాపాడే సీటు బెల్టుతో సిద్ధార్ట్ ప్రాణాలు తీశారు వినోద్, శ్యామ్.
క్రైమ్‌కు కొత్త టచ్ ఇచ్చిన ఐడియా వాళ్లదేనా? లేక మరెవరైనా వీళ్లను డైరెక్ట్ చేశారా? కుటుంబ ఆస్తి తగాదాలే హత్యకు దారితీశాయా? సిద్ధార్థ్ తండ్రికి ఇద్దరు భార్యలు. క్రైమ్ స్కెచ్ సూత్రధారి అతడి చిన్నమ్మదే అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఐతే సిద్ధార్థ్ తండ్రి మాత్రం తమ కుటుంబంలో ఎలాంటి గొడవల్లేవన్నారు. శ్యామ్,వినోద్ ఎవరో తమకు తెలియదన్నారాయన. మరోవైపు అమ్మాయి ప్రేమ వివాదంలో సిద్ధార్థ్‌ను లేపేశారనే వాదన కూడా ఉంది. సిద్ధార్థ్‌తో గొడవ తర్వాత చంపేసి ఉంటారని అనుకుంటున్నారు. మరోవైపు సిద్ధార్థ్ హత్య తర్వాత ఏ1 శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వినోద్ విచారణలో ఏం చెబుతాడన్న దానిపైనే ఈ కేసు అసలు నిజాలు ఆధారపడి ఉన్నాయి. అంతా అనుకుంటున్నట్లు పెద్దిల్లు-చిన్నిల్లు వివాదమా..? అమ్మాయి ప్రేమ వ్యవహారమా..? నిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.