Sunrisers: ‘మాకు మా గచ్చిబౌలి దివాకర్‌ ఉన్నాడు’… నవ్వులు పూయిస్తోన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్వీట్‌..

Sunrisers Tweet Brahmanandam Photo: సోషల్ మీడియాలో ప్రాసులు, పంచులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ నెటిజెన్లకు సంతోషాన్ని పంచుతున్నారు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..

Sunrisers: 'మాకు మా గచ్చిబౌలి దివాకర్‌ ఉన్నాడు'... నవ్వులు పూయిస్తోన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్వీట్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 04, 2021 | 5:49 AM

Sunrisers Tweet Brahmanandam Photo: సోషల్ మీడియాలో ప్రాసలు, పంచులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ నెటిజెన్లకు సంతోషాన్ని పంచుతున్నారు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌ నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైస్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో అమీర్‌ ఖాన్‌, దిలీప్‌ జోషిలతో పాటు క్రికెటర్‌ పాత్రను పోషించిన మరో ఇద్దరి ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌.. ‘ఈ ఏడాది ఐపీల్‌కు వేలంపాటలో ఉన్న కొందరు టాప్‌ క్రికెటర్లు వీరే.. మీకెవరు కావాలి.?’ అని క్యాప్షన్‌ను జోడించింది. అయితే రాజస్థాన్‌ రాయల్స్ పోస్ట్‌ చేసిన ఈ ఫన్నీ పోస్ట్‌పై.. అంతే ఫన్నీగా స్పందించింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. ఈ ట్వీట్‌కు రిప్లైగా ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలోని బ్రహ్మానందం క్రికెట్‌ ఆడుతోన్న జిఫ్‌ ఫైల్‌ను పోస్ట్‌ చేస్తూ.. ‘మేం మా క్రికెటర్‌ను ఇప్పటికే ఎన్నుకున్నం’ అంటూ కామెంట్‌ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ‘గచ్చబౌలి దివాకర్‌’ అనే పాత్రలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read: CSK New Title Sponsor : ఐపీఎల్​లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు టైటిల్​స్పాన్సర్‌గా ‘స్కోడా’..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..