World badminton rankings : బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ..
భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు-అశ్విని పొన్నప్ప ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటారు. మంగళవారం ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-20లోకి దూసుకెళ్లారు. టయోటా థాయ్‌లాండ్
World Badminton Rankings : భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు-అశ్విని పొన్నప్ప ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటారు. మంగళవారం ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-20లోకి దూసుకెళ్లారు. టయోటా థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో సెమీస్ చేరుకున్న సాత్విక్- అశ్వినిలు 16 స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమంగా 19వ ర్యాంకు సాధించారు.
ఇదే టోర్నీలో పురుషుల డబుల్స్ సెమీస్ చేరుకున్న సాత్విక్- చిరాగ్‌శెట్టి జోడీ పదో ర్యాంకు నిలబెట్టుకుంది. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 7వ, సైనా 19వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ (13), సాయిప్రణీత్ (17), కశ్యప్ (26), సమీర్‌వర్మ (27) ర్యాంకులు సాధించారు. వీరు టాప్-20లోకి దూసుకెళ్లి కెరీర్‌లో అత్యుత్తమంగా 19వ ర్యాంకుకు చేరుకున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చిలో ఆగిపోయిన ర్యాంకింగ్స్ ప్రక్రియను ప్రపంచ టూర్ ఫైనల్స్ అనంతరం పునఃప్రారంభించారు. మార్చి 2 నుంచి 7 వరకు జరిగే స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీతో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతాయి. మే 11 నుంచి 16 వరకు జరిగే ఇండియా ఓపెన్‌తో క్వాలిఫయింగ్ సమయం ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి :
CSK New Title Sponsor : ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు టైటిల్స్పాన్సర్గా ‘స్కోడా’..