వరలక్ష్మి హత్య కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
గాజువాకలో దారుణ హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పథకం ప్రకారమే వరలక్ష్మి హత్య జరిగింది.
Gajuwaka girl murder: గాజువాకలో దారుణ హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పథకం ప్రకారమే వరలక్ష్మి హత్య జరిగింది. ఆమె మరొకరితో సన్నిహితంగా ఉన్నందుకే హత్య చేసినట్లు తేలింది. అనుమానంతోనే వరలక్ష్మిని గుడి వద్దకు పిలిచి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ( బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడు.. పోలీసులకు భార్య ఫిర్యాదు)
అయితే వరలక్ష్మి వెంట అఖిల్ ప్రేమ పేరిట వెంటపడ్డాడు. అదే సమయంలో రాము అనే యువకుడు వరలక్ష్మితో సన్నిహితంగా ఉండటం భరించలేక పోయిన అఖిల్.. పథకం ప్రకారం హత్య చేశాడు. మరోవైపు వరలక్ష్మి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ కుమార్తె ప్రాణం తీసిన అఖిల్‌ని కఠినంగా శిక్షించాలని వరలక్ష్మి తల్లి డిమాండ్ చేస్తోంది. ( ‘మహా సముద్రం’ కోసం గోవా వెళ్లనున్న టీమ్..!)