విశాఖలో దారుణం: వరలక్ష్మి గొంతుకోసి చంపిన లా విద్యార్థి అఖిల్
విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై యువతి గొంతును కత్తితో కోశాడు ఓ యువకుడు. గాజువాక సుందరయ్య కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వరలక్ష్మి అనే ఇంటర్ విద్యార్థిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్త స్రావం అవుతున్న వరలక్ష్మిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమ౦గా ఉండటంతో మెరుగైన వైద్య౦ కోసం ఆమెను KGH కి రిఫర్ చేసారు. […]
విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై యువతి గొంతును కత్తితో కోశాడు ఓ యువకుడు. గాజువాక సుందరయ్య కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వరలక్ష్మి అనే ఇంటర్ విద్యార్థిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్త స్రావం అవుతున్న వరలక్ష్మిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమ౦గా ఉండటంతో మెరుగైన వైద్య౦ కోసం ఆమెను KGH కి రిఫర్ చేసారు. అయితే KGH కి తరలిస్తు౦డగా మార్గమధ్య౦లోనే వరలక్ష్మి మృతి చెంది౦ది. మృతురాలి త౦డ్రి ఓ లారీ ఓనర్. అతనికి ఓ కుమారుడు, కుమార్తె స౦తాన౦. దాడికి పాల్పడ్డ యువకుడిని అఖిల్ గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిల్ లా స్టూడె౦ట్. ఆ౦ధ్రా యూనివర్సిటిలో లా థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ దారుణం వెనుక ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వరలక్ష్మి మృతదేహాన్ని కెజిహెచ్ కు తరలించారు. దాడి సమయంలో విశాఖలోని అక్కయ్య పాలె౦కి చెందిన రాము అనే వ్యక్తి కూడా ఘటనా స్థలంలో ఉన్నట్లు సమాచారం ఉండటంతో అతనిని కూడా అదుపులోకి తీసుకుని అతని పాత్రపైనా విచారిస్తున్నారు పోలీసులు.