వేట: ఆవుపై కాల్పుల కేసును చేధించిన పరిగి పోలీసులు
వికారాబాద్ లో కలకలం సృష్టించిన ఆవు పై కాల్పుల కేసును పరిగి పోలీసులు చేధించారు. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ యజమాని ఇమ్రాన్ తన స్నేహితులతో కలిసి ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో హంటింగ్ కు వెళ్లి కాల్పులకు పాల్పడినట్టు తేల్చారు. ఇమ్రాన్ ఓపెన్ టాప్ జీప్ లో స్నేహితుడు అజహర్ ఉద్దీన్ తన రివాల్వర్ తో ఫైరింగ్ పాల్పడ్డాడు. రాత్రి సమయంలో జింక కళ్ళు అని భావించి ఆవు పై కాల్పులు […]
వికారాబాద్ లో కలకలం సృష్టించిన ఆవు పై కాల్పుల కేసును పరిగి పోలీసులు చేధించారు. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ యజమాని ఇమ్రాన్ తన స్నేహితులతో కలిసి ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో హంటింగ్ కు వెళ్లి కాల్పులకు పాల్పడినట్టు తేల్చారు. ఇమ్రాన్ ఓపెన్ టాప్ జీప్ లో స్నేహితుడు అజహర్ ఉద్దీన్ తన రివాల్వర్ తో ఫైరింగ్ పాల్పడ్డాడు. రాత్రి సమయంలో జింక కళ్ళు అని భావించి ఆవు పై కాల్పులు చేసినట్టు నిందితుడు అజహర్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. తన స్నేహితుడు ఇమ్రాన్, మెహబూబ్, రఫీ, రామచందర్ తో కలిసి హంటింగ్ కు వెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. వీరందరి పై ఐపీసీ తోపాటు, ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పరిగి పోలీసులు.