యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో… నిందితులకు 25 ఏళ్ల జైలు శిక్ష!

యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఝార్ఖండ్ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు దోషులకు 25ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. దీంతో పాటు రూ.10వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలుశిక్ష అదనంగా అనుభవించాలని తీర్పులో పేర్కొంది. ఝార్ఖండ్‌లోని సిండేగా శివారు ప్రాంతానికి చెందిన 20ఏళ్ల యువతి 2017, అక్టోబర్ 30వ తేదీన మెడిసిన్ కొనేందుకు సింగేడా పట్టణానికి వెళ్లోంది. దారిలో ఆమెను విజయ్ కుమార్, అజయ్ మిశ్రా […]

యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో... నిందితులకు 25 ఏళ్ల జైలు శిక్ష!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 08, 2019 | 4:46 PM

యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఝార్ఖండ్ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు దోషులకు 25ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. దీంతో పాటు రూ.10వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలుశిక్ష అదనంగా అనుభవించాలని తీర్పులో పేర్కొంది.

ఝార్ఖండ్‌లోని సిండేగా శివారు ప్రాంతానికి చెందిన 20ఏళ్ల యువతి 2017, అక్టోబర్ 30వ తేదీన మెడిసిన్ కొనేందుకు సింగేడా పట్టణానికి వెళ్లోంది. దారిలో ఆమెను విజయ్ కుమార్, అజయ్ మిశ్రా అనే యువకులు అమెను అపహరించి ఝుంకీ హిల్స్ సమీపంలోని రాణికుడర్ ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. అక్కడ ఇద్దరూ యువతిపై అత్యాచారానికి పాల్పడి ఖెరంటోలి గ్రామ శివారులో వదిలేసి వెళ్లిపోయారు.

దీంతో బాధితురాలు సిండేగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేశారు. రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి పక్కా ఆధారాలతో కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం విజయ్‌కుమార్, అజయ్ మిశ్రాలను దోషులుగా నిర్ధారించి 25ఏళ్ల చొప్పున జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.