ఈతకు వెళ్లి ఇద్దరు బాలుర మృతి
తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాతపడ్డారు.

తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాతపడ్డారు. ఎటపాక మండలం పాలమడుగు గ్రామానికి చెందిన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇరప మహేశ్ (12), సొందె సాయి కిరణ్ (11)లు చెరువులో మునిగి మృత్యువాత పడ్డారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరు పిల్లలు అప్పటికే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యుల రోదనలతో నిండిపోయింది.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




