AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడు నెలల గర్బిణి అయిన భార్య కడుపుకోసిన కసాయి భర్త

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. తనకు పుట్టబోయే బిడ్డ అడా, మగ అని తెలుసుకునేందుకు ఓ కసాయి భార్య కడుపును చీల్చి చూసే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడ్డ మహిళ ఆస్పత్రిలో కొనఉపిరితో కొట్టుమిట్టాడుతోంది.

ఏడు నెలల గర్బిణి అయిన భార్య కడుపుకోసిన కసాయి భర్త
Balaraju Goud
|

Updated on: Sep 20, 2020 | 6:35 PM

Share

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. తనకు పుట్టబోయే బిడ్డ అడా, మగ అని తెలుసుకునేందుకు ఓ కసాయి భార్య కడుపును చీల్చి చూసే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడ్డ మహిళ ఆస్పత్రిలో కొనఉపిరితో కొట్టుమిట్టాడుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని సివిల్ లైన్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సివిలైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నాలల్ (35) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఐదుగురు సంతానం. ప్రస్తుతం భార్య ఏడునెలల గర్భిణి కూడా. అయితే, ఇప్పటికే ఐదుగురికి జన్మనిచ్చినా.. నిందితుడు తనకు కొడుకు కావాలంటూ భార్యను నిత్యం వేదించేవాడు. ఇదే క్రమంలో ఆరోసారి గర్భం దాల్చింది ఆ మహిళ. ప్రస్తుతం ఆమె ఏడునెలల గర్భవతి కావడంతో పుట్టబోయే బిడ్డ అమ్మాయా? అబ్బాయా? తెలుసుకోవాలని పట్టుబట్టాడు. తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసుకునేందుకు పదునైన చాకుతో భార్య గర్భాన్ని చీల్చాడు. దీంతో ఆ బాధను తట్టుకోలేని బాధితురాలి కేకలు వేసింది. బాధితురాలి అరుపులకు అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకునేసరికి ఆమె తీవ్రస్రావంతో కుప్పకూలింది. దీంతో ఆమెను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు చేసిన దుర్మార్గంపై సమాచారం అందుకున్న సిటీ ఎస్పీ ప్రవీణ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, తనకు పుట్టబోయే బిడ్డ ఎవరనేది తెలుసుకునేందుకు భర్త పన్నాలల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ ప్రవీణ్ చెప్పారు. నిందితుడు పన్నాలల్ ను అరెస్ట్ చేశామని తెలిపారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..