హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న యువతిని అతి వేగంగా వచ్చిన టూ వీలర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన తీరు సమీపంలో ఉన్న ట్రాఫిక్ సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. రోడ్డు దాటేందకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే డివైడర్ మీదు నుంచి రోడ్డుపైకి వచ్చిన యువతి.. వేగంగా దూసుకొచ్చిన ఓ టూవీలర్ ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో యువతి ఎగిరి పడింది.. ఆ తర్వాత కూడా వాహనం కంట్రోల్ కాకపోడంతో మరింత ప్రమాదం జరిగింది. వాహనం నడుపుతున్న వ్యక్తి ఆ యువతిపై పడిటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వాహనం నడుపుతున్న వ్యక్తి కూడా రోడ్డు దాటున్న యువతిని గమనించక పోవడంతో ప్రమాదానికి కారణంగా పోలీసు భావిస్తున్నారు.