Adulterated oil : టీవీ9 ఎఫెక్ట్ : గుట్టు చప్పుడు కాకుండా నడిపేస్తోన్న కల్తీ నూనెల దందాలపై ఉక్కుపాదం
వంట నూనె ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు. అలాంటి వంట నూనెలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రమాదకరంగా కల్తీ..
Attacks on adulterated oil Manufacturing Centers: వంట నూనె ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు. అలాంటి వంట నూనెలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రమాదకరంగా కల్తీ చేస్తున్నారు. బాగా నడుస్తుంది కదా అని.. వంట నూనెల రిఫిల్లింగ్‌ను పర్మిషన్స్ లేకుండా చేసేస్తున్నారు నిర్మల్ లోని మారుతి ఆయిల్ మర్చంట్, హనుమాన్ ట్రేడర్స్, మనోహర్ కిరాణా షాప్స్ యజమానులు. నిబంధనలకు విరుద్ధంగా నూనె ప్యాకెట్లు, డబ్బాల తయారీ చేస్తున్న దందాపై టీవీ9 గత నెల నుండి వరుస కథనాలను ప్రసారం చేస్తోన్న సంగతి తెలిసిందే.
టీవీ9 లో వరుస కథనాలతో ఎట్టకేలకు స్పందించిన పుడ్ సెఫ్టీ అధికారులు, నిర్మల్‌లోని షాపులపై ఇవాళ దాడులు నిర్వహించారు. సన్‌ప్లవర్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, ఎస్ బ్రాండ్ డబుల్ ఫిల్డర్ ఆయిల్స్ శాంపిల్స్ తీసుకున్నారు. వీటిని హైదరాబాద్‌లోని నాచారం ల్యాబ్‌కు పంపించారు.
బ్రాండ్ల పేర్లు వాడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని వ్యాపారులను అధికారులు హెచ్చరించారు. వినియోగదారులు నాణ్యమైన సరుకులే తీసుకోవాలన్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పుడ్ స్టేప్టీ అధికారులు టీవీ9 కు వెల్లడించారు.
Read also: Etela: ‘ఆ లేఖ నాది కాదు..’ మధువని గార్డెన్‌లో రాజేందర్ రుస రుస.! హుజూరాబాద్ ప్రజలకు నివేదన