Etela: ‘ఆ లేఖ నాది కాదు..’ మధువని గార్డెన్‌లో రాజేందర్ రుస రుస.! హుజూరాబాద్ ప్రజలకు నివేదన

Etela: 'ఆ లేఖ నాది కాదు..'  మధువని గార్డెన్‌లో రాజేందర్ రుస రుస.! హుజూరాబాద్ ప్రజలకు నివేదన
Etela Rajendar

తన పైన మావోయిస్టు పార్టీ లేఖ రాసిందంటూ వైరల్ అవుతోన్న లెటర్ నిజమైంది కాదని తెలంగాణ బీజేపీ తాజా నేత..

Venkata Narayana

|

Jul 07, 2021 | 5:27 PM

తన పైన మావోయిస్టు పార్టీ లేఖ రాసిందంటూ వైరల్ అవుతోన్న లెటర్ నిజమైంది కాదని తెలంగాణ బీజేపీ తాజా నేత ఈటల రాజేందర్ చెప్పారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ ఆయన హుజూరాబాద్ ప్రజలకు వివరణ ఇచ్చారు. ఇవాళ హుజూరాబాద్ మధువని గార్డెన్ లో నిర్వహించిన బీజేపీ నేతల మీడియా సమావేశంలో ఈటల రాజేందర్.. తెలంగాణ సర్కారుపై రుస రుసలాడారు. “రెండు నెలల ఆరు రోజులుగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. రోజుకో అబద్దాల పుట్ట ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో పుట్టిస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు”  గొప్ప పథకాలను వ్యతిరేకిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 61 వేల రైతాంగానికి ఈటల లేఖలు రాశారు.

“ఇలాంటి లెటర్స్ ని ఇక్కడ రైతులు నమ్ముతారని మీరు భావిస్తున్నారా? ఈటల ఎవరి పక్షాన ఉంటారో ఇక్కడ ఉన్నవారందరికీ తెలుసు. ఇప్పటికీ అడుగుతున్న.. దున్నని భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు, ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి రైతుబందు ఇవ్వొద్దని ఆనాడు అన్నాము, రేపు కూడా అంటాము. ప్రజలు కట్టిన టాక్స్ డబ్బులను అనర్హులకు ఇవ్వడం న్యాయం కాదు అంటున్నాను, అంతే తప్ప పేదవాడికి రైతుబంధు ఇవ్వొద్దని ఏనాడు అనలేదు, ఇలాంటి నీచపు ప్రచారాలు చేస్తే తప్పకుండ ప్రజలు అసహ్యించుకుంటారు. పెన్షన్లు,రేషన్ కార్డు లు మూడు సంవత్సరాలుగా ఇవ్వడం లేదు అని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని గొంత్తెత్తిన తప్ప వాటిని వద్దు అని ఎక్కడ చెప్పలేదు. ఇలాంటి అబద్దపు ప్రచారంను తీవ్రంగా ఖండిస్తున్నాము. మావోయిస్ట్ లు లేఖ రాసినట్టు సృష్టించారు, ఒక కులం ఓట్లు, ఒక వర్గం ఓట్లు అక్కరలేదు నేను అన్నానని సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు. నేను 20 ఏళ్లుగా అనేక సమస్యల మీద స్పందిచిన వాడిని నేను అలా మాట్లాడతనా? అలా చిల్లరగా మాట్లాడితే ఇంతమంది ప్రజల ప్రేమను పొందేవాడినా ? విజ్ఞత గల రాజకీయనాయకుడిగా మరో మారు ప్రజలకు విజ్ఞప్తి చెప్తున్నా ఇవన్నీ కూడా ఓట్ల కోసం, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న జిమ్మిక్కులు. వాటిని ప్రజలు నమ్మవద్దు అని కోరుతున్నాను. నేను రాజశేఖర్ రెడ్డి ని, రేవంత్‌ని ఎదో అన్నట్టు పుట్టిస్తున్నారు ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మవద్దు అని కోరుతున్న.” అని ఈటల ప్రజలకు విన్నవించారు.

“పోలీస్, ప్రభుత్వ అధికారులు చట్టానికిలోబడి పని చేయాలి తప్ప.. ఇష్టానికి లోబడిపని పని చేయవద్దు అని పదే పదే చెప్తున్నా.. ఇక్కడ పని చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్ దిన్ కా సుల్తాన్ లాగా మండలానికి ఒక ఎమ్మెల్యే, 5 మంది మంత్రులు, ఇక్కడి మంత్రులు మేమే అంటున్నారు. మీరందరూ మీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి.. మీ.. మీ నియోజకవర్గాల్లో అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తున్నారా ? ఎన్నికలు ఉన్న నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట్ల కొత్తవి ఇస్తున్నారా ? ఈ ప్రభుత్వం ఎన్నికల కోసం పని చేసే ప్రభుత్వం తప్ప, ప్రజా సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం కాదు అని మీ చర్యలే చెప్తున్నాయి.” అని ఈటల విమర్శలు, ఆరోపణలు గుప్పించారు.

“ఇంటిలిజెన్స్ పోలీసులు ఇంటింటికి తిరిగి ప్రజలను భయపెడుతున్నారు. 5, 6 సంవత్సరాల క్రితం కేసులను కూడా తిరగతోడుతున్నారు. పువ్వు గుర్తు స్టిక్కర్ ఉన్న వాహనాల పై కూడా ఎదో ఒక కేసు రాసే దుస్థితికి వచ్చింది. దేశాన్ని పాలిస్తున్న పార్టీ పట్ల కూడా ఇలా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ ఉత్తగా పోవు యదా రాజ తదా ప్రజా అన్నట్టుగా.. ఇలాంటి పిచ్చి పనులు ఆపండి లేదంటే దీనికి మీరు బలి అవుతారు అని హెచ్చరిస్తున్న. వచ్చే ఎన్నికల తరువాత ఈ పార్టీ అధికారంలో ఉండదు. ఈ ప్రభుత్వం గాడి తప్పింది, అపసవ్యంగా నడుస్తుంది అని ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టం అని ప్రజలు భావిస్తున్నారు, ఐఏఎస్ అధికారులు అనుకుంటున్నారు. హుజురాబాద్ లో ఎగిరేది కాషాయ జెండానే, వికసించేది కమలమే. ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి, అండగా ఉండండి, నిండు మనసుతో ఆశీర్వదించండి.” అని ఈటల మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వం మీద వరుస విమర్శలు గుప్పించారు.

ఈ మీడియా సమావేశంలో హుజురాబాద్ బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎన్నికల BJP ఇంచార్జ్ జితేందర్ రెడ్డి, A చంద్రశేఖర్, ఏనుగు రవీందర్ రెడ్డి, ధర్మరావు, వన్నాల శ్రీరాములు, రేవూరి ప్రకాష్, కృష్ణా రెడ్డి, nvss ప్రభాకర్, కూన శ్రీశైలం, చాడ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read also : HCA: టై మ్యాచ్‌ను తలపిస్తోన్న హెచ్‌సీఏ వివాదం.. అజర్ Vs అపెక్స్ మధ్య టగ్ ఆఫ్‌ వార్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu