మాండ్యాలో ముగ్గురు పూజారుల హత్య.. ఆలయంలో నగదు, నగలు దోపిడీ

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ముగ్గురు పూజారులు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం మాండ్యా నగర శివార్లలోని గుత్తాలు వద్ద ఉన్న శ్రీ అరకేశ్వర ఆలయ ప్రాంగణంలో ముగ్గురు పూజారులను గుర్తు తెలియని దుండగులు హతమార్చి ఆలయంలోని హుండీ నగదు, నగలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

మాండ్యాలో ముగ్గురు పూజారుల హత్య.. ఆలయంలో నగదు, నగలు దోపిడీ
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 11, 2020 | 3:15 PM

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ముగ్గురు పూజారులు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం మాండ్యా నగర శివార్లలోని గుత్తాలు వద్ద ఉన్న శ్రీ అరకేశ్వర ఆలయ ప్రాంగణంలో ముగ్గురు పూజారులను గుర్తు తెలియని దుండగులు హతమార్చి ఆలయంలోని హుండీ నగదు, నగలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

మాండ్యా జిల్లాలోని గుత్తాలు శ్రీ అరకేశ్వర ఆలయంలో గణేష్, ప్రకాష్, ఆనంద్ పూజారులుగా పనిచేస్తున్నారు. వరుసకు అన్నదమ్ముళ్లు అయిన ముగ్గురు ఆలయం అలనా పాలనాలో భాగం పూజలు నిర్వహిస్తూ, రాత్రి సమయంలో గుడిలోనే నిద్రిస్తుంటారు. ఇదే క్రమంలో గురువారం రాత్రి నిద్రిస్తున్న వారిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి తలలపై బండరాళ్ల మోది హతమార్చారు. అనంతరం ఆలయంలో హుండీలను చోరీ చేసిన దొంగలు నగదు, నగలు దోచుకెళ్లారు. కాగా, చిల్లర నాణాలను మాత్రం అక్కడే వదిలి వెళ్లారు దుండగులు.

శుక్రవారం ఉదయం శ్రీ అరకేశ్వర ఆలయ తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు గుడి తలుపులు తెరిచిచూడగా.. ముగ్గురు పూజారుల మృతదేహాలు కొలను సమీపంలో రక్తపు మడుగులో పడిఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో హంతకుల కోసం వేట మొదలు పెట్టారు. కాగా, ముగ్గురూ నిద్రలో చనిపోయారని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ హత్యలకు ముగ్గురు దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నమన్నారు. ఆలయ హండీలను గుడి ప్రాంగణం బయటకు తరలించడం, ప్రధానంగా కానుకలు, నగదును దోచుకోవడంతో ఈ హత్యల వెనుక దోపిడీ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని, నిందితుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టిన మాండ్య ఎస్పీ పరశురాం తెలిపారు.. నిందితులను గుర్తించడానికి స్నిఫర్ డాగ్స్ సహాయం తీసుకుంటున్నామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు నేరస్థలం నుండి ఆధారాలను సేకరించడం ప్రారంభించారు. అయితే, ఈ ఘటనలో మరణించిన ముగ్గురు పూజారుల కుటుంబాలకు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప ఒక్కొక్కరికి రూ .5 లక్షల పరిహారం ప్రకటించారు.