Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కారు రూపంలో వచ్చిన మృత్యువు.. తల్లి, తండ్రి, కొడుకు దుర్మరణం..

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కారు రూపంలో వచ్చిన మృత్యువు.. తల్లి, తండ్రి, కొడుకు దుర్మరణం..
Road Accident

Guntur Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఈ విషాదఘటన చోటుచేసుకుంది. ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన షేక్‌ చినమస్తాన్‌ కుటుంబంతో బైక్ వస్తుండగా ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో అతనితో పాటు ఆయన భార్య, కుమారుడు తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. మృతులను ఫిరంగిపురం మండలం తాళ్లూరుకు చెందిన షేక్‌ చినమస్తాన్‌, ఆయన భార్య నూర్జహాన్‌, కుమారుడు హుస్సేన్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also….సుధ కొంగర చూపు ఇప్పుడు టాలీవుడ్ పైనే.. పాన్ ఇండియా స్టార్‏తో సినిమా చేయనున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..